ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flash back Rajanala : హాలీవుడ్‌ చిత్రంలోనూ నటించిన రాజనాల

ABN, First Publish Date - 2023-03-05T00:03:31+05:30

తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలకు ఓ ప్రత్యేకత తెచ్చిన ఘనత రాజనాలదే. అంతుకుమందు విలన్‌ పాత్రలు పోషించిన నటులు కొందరు ఉన్నా వారెవరూ తమదైన ముద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలకు ఓ ప్రత్యేకత తెచ్చిన ఘనత రాజనాలదే. అంతుకుమందు విలన్‌ పాత్రలు పోషించిన నటులు కొందరు ఉన్నా వారెవరూ తమదైన ముద్ర చూపించలేకపోయారు. రాజనాల రాకతో విలనీకి రాచఠీవి వచ్చింది. అంతేకాదు ఒకానొక సమయంలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఖ్యాతి ఆయనది.

రాజనాల జీవితమంతా మద్రాసులోని టీ నగర్‌తో ముడిపడి ఉండేదని చెప్పాలి. ఆంధ్ర నుంచి ప్రతి రోజూ ఎవరో ఒకరు వారింటికి వస్తుండేవారు. రోజూ కనీసం పాతిక మంది అన్నా వాళ్ల ఇంట్లో భోజనం చేస్తుండేవారు. అందుకే ఆయన ఇంటిని ఆ రోజుల్లో ‘రాజనాల సత్రం’ అని చమత్కారంగా అంటుండేవారు. ఆయన మొదటి భార్య శోభ సాక్షాత్తు అన్నపూర్ణమ్మే. వచ్చిన వారికి లేదనకుండా వండి వడ్డించేవారు. ఇక రాజనాల షూటింగ్‌లో ఉంటే పదిమందికి సరిపడేలా రకరకాల వంటకాలతో క్యారియర్‌ను స్పాట్‌కు పంపించేవారు శోభ. రాజనాలకు చెన్నెలో ఐదు భవంతులు ఉండేవి. ఖరీదైన ఐదు కార్లు ఉండేవి. కావలిలో 32 ఎకరాల స్థలం కూడా ఉండేది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖ్యాతి మిగిలింది తప్ప ఆస్తులు అన్నీ కరిగిపోయాయి.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు రాజనాల. అలాగే రెండు హిందీ సినిమాలతో పాటు ‘మాయా ద మాగ్నిఫిషియెంట్‌’ అనే ఆంగ్ల చిత్రంలో ఇండియన్‌ నావీ ఛీఫ్‌గా నటించారు. ఏ భాషలో నటించినా తన డైలాగులు తనే చెప్పుకొనే వారు రాజనాల. మరొకరితో డబ్బింగ్‌ చెప్పించడానికి అంగీకరించేవారు కాదు.

Updated Date - 2023-03-05T00:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising