ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rashmika : రష్మిక ఫుల్‌ ఖుషి

ABN, First Publish Date - 2023-12-09T23:46:00+05:30

బాలీవుడ్‌లో తన ప్రతాపం చూపించాలని రష్మిక ఎప్పటి నుంచో అనుకొంటోంది. ఇదివరకు ప్రయత్నాలు చేసింది కానీ, తగిన ఫలితం రాలేదు. అయుతే

బాలీవుడ్‌లో తన ప్రతాపం చూపించాలని రష్మిక ఎప్పటి నుంచో అనుకొంటోంది. ఇదివరకు ప్రయత్నాలు చేసింది కానీ, తగిన ఫలితం రాలేదు. అయుతే ‘యానిమల్‌’ మాత్రం రష్మిక జాతకాన్నే మార్చేసింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకొంది. బాలీవుడ్‌ అంతటా ఈ సినిమా గురించే చర్చ. ఇందులో రష్మిక పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. కొన్ని బోల్డ్‌ సన్నివేశాల్లో ఎలాంటి బెరుకూ లేకుండా నటించడం బాలీవుడ్‌ జనాలకు బాగా నచ్చింది. ఈ సినిమాతో రష్మిక కెరీర్‌ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. ‘‘యానిమల్‌ ఈ స్థాయిలో జనాదరణ పొందుతుందని నేను అనుకోలేదు. నిజంగానే ఇది అపూర్వం. ఇందులో గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది. పాత్రలో ఉన్న ధైర్యం, తెగువ ప్రేక్షకులకు నచ్చాయి. అందుకే ఈ చిత్రంతో పాటు నా పాత్రకూ గుర్తింపు దక్కింది. సెట్లో ప్రతీ రోజూ ఆస్వాదించాను. ప్రతి క్షణం ఓ కొత్త విషయం నేర్చుకొన్నాను. నా జీవితంలో ఈ సినిమా మర్చిపోలేనిది. ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తించుకొంటాను’’ అంటోంది రష్మిక. ఈ హిట్‌తో బాలీవుడ్‌లోనూ రష్మిక బిజీగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-12-09T23:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising