ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wolf: అనుకున్నదొక్కటి... అయ్యిందొక్కటి!

ABN, First Publish Date - 2023-03-06T22:41:05+05:30

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పొలిమేరకు ప్రతిరోజు గొర్రెల గుంపును తోలుకొని వచ్చేవాడు గొర్రెల కాపరి. గొర్రెలు పచ్చగడ్డి మేసేవి.. పారే కాలువలో నీళ్లు తాగేవి. ఆ గొర్రెలన్నీ తెల్లగా ఉండేవి. ఆ గొర్రెల గుంపును ఓ తోడేలు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పొలిమేరకు ప్రతిరోజు గొర్రెల గుంపును తోలుకొని వచ్చేవాడు గొర్రెల కాపరి. గొర్రెలు పచ్చగడ్డి మేసేవి.. పారే కాలువలో నీళ్లు తాగేవి. ఆ గొర్రెలన్నీ తెల్లగా ఉండేవి. ఆ గొర్రెల గుంపును ఓ తోడేలు చూసింది. ఈ గొర్రెలన్నీ బాగా మేసినవి. తింటే ఎంత రుచిగా ఉంటాయో అనుకుంది. అనుకుందే తడవుగా దానికో ఆలోచన వచ్చింది. తెల్లని జుట్టు, చర్మం ఉండేట్లు ఓ తోలు కప్పుకుని వచ్చింది మరుసటి రోజు.

గొర్రెలు ఎప్పటిలాగే అడవికి వచ్చాయి. మేసి ఇంటికి వెళ్తున్నపుడు.. అది కూడా సూర్యాస్తమ సమయంలో ఆ గుంపులో ఈ తోలు కప్పుకున్న తోడేలు కలసిపోయింది. గుంపులో గోవిందలా ఇంటికి వెళ్లిపోయింది. గొర్రెల మధ్య నడుస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు రాత్రవుతుందా? తినేయాలి అనే ఆలోచనతో ఊగిపోయింది తోడేలు. దొడ్లోకి గొర్రెలతో పాటు వెళ్లింది. ఇక రాత్రయితే చాలు.. ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందని అనుకుంది.

అంతలోనే రాత్రి భోజనంకోసం ఓ గొర్రెను తీసుకురమ్మని తన సర్వంట్‌ను గొర్రెల కాపరి పంపాడు. అతడు లోపలకి వచ్చి బ్యాటరీ వేసి వెతికాడు. అంతలో ఓ పెద్ద గొర్రె అతని కళ్లకు కనపడింది. తెల్లజుట్టు కప్పుకున్నది తోడేలని అతను గ్రహించలేదు. బలమైన గొర్రె బావుందే! అని తోడేలును బయటకు ఎత్తుకెళ్లాడు. బయటికి వెళ్తూనే.. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు ఒక్కసారిగా ఎగిరి దుమికి అడవిలోకి పారిపోయింది. మళ్లీ అటుపక్కకు రాలేదెన్నడూ ఆ తోడేలు.

Updated Date - 2023-03-06T22:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising