ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shri Rajarajeshwari Devi : నేటి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరీదేవి

ABN, First Publish Date - 2023-10-23T00:08:46+05:30

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా... విజయదశమిని పురస్కరించుకొని కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. ఆమె సకల భువన, బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర

దేవీ నవరాత్రుల్లో అమ్మవారు చివరి రోజున మహిషాసురమర్దనీదేవి, రాజరాజేశ్వరీదేవిగా... రెండు అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఏడాది ఉత్సవాలలో ప్రత్యేకత. అమ్మవారికి సహజంగా చేసే స్వరూప అలంకారాలను తిథి, నక్షత్రాలను ప్రధానంగా తీసుకుని చేస్తారు. తిథులలో హెచ్చుతగ్గులు రావడంతో... ఆశ్వయుజ శుద్ధ నవమి, ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) రోజుల్లో చేసే శ్రీ మహిషాసురమర్దని, శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారాలు రెండింటినీ సోమవారమే చేస్తారు.

ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)

సోమవారం మధ్యాహ్నం

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా... విజయదశమిని పురస్కరించుకొని కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. ఆమె సకల భువన, బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మను మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంత స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. మాయామోహితులైన మానవుల్లో చైతన్యాన్ని యోగమూర్తిగా ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఆమె అధిష్ఠాన దేవత. ఆమెను కొలిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, కోరికలు నెరవేరుతాయనీ భక్తుల నమ్మిక.దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు లభిస్తాయి. అమ్మవారిని ఎరుపు రంగు గాజులతో అలంకరించి, కుంకుమార్చన చేయడం శ్రేష్టం.

నైవేద్యం: పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రోసోపేత) పదార్థాలు

అలంకరించే చీర రంగు: ఆకుపచ్చ, తెలుపు

అర్పించే పూల రంగు: ఎరుపు

పారాయణ: లలితా సహస్రనామాలు

Updated Date - 2023-10-23T00:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising