Shri Saraswati Devi : నేటి అలంకరణ శ్రీ సరస్వతీ దేవి
ABN, First Publish Date - 2023-10-19T23:27:47+05:30
ఆశ్వయుజ శుద్ధ షష్టి, శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజున శ్రీ సరస్వతీ దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి అధిక
(మూలా నక్షత్రం)
ఆశ్వయుజ శుద్ధ షష్టి, శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజున శ్రీ సరస్వతీ దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా. దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, దండ, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తుందనేది అనాది విశ్వాసం. త్రిశక్తుల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం, కలుగుతాయి. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో విలసిల్లే వాగ్దేవి... ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని.
నైవేద్యం: దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు
అలంకరించే చీర రంగు: తెలుపు
అర్పించే పూలు : కలువ పూలు
పారాయణ: సరస్వతీ స్తోత్రాలు
Updated Date - 2023-10-19T23:27:47+05:30 IST