Stiffness of Muscles : గట్టితనం కోసం...
ABN, First Publish Date - 2023-06-14T03:46:00+05:30
ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలనుకుంటారు. వ్యాయామాలతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. కండరాలు, ఎముకల గట్టితనం ఉండాలంటే.. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..
ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలనుకుంటారు. వ్యాయామాలతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. కండరాలు, ఎముకల గట్టితనం ఉండాలంటే.. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..
మాంసాహారం తినటం వల్ల కండరాల్లో బలం వస్తుంది. వీటితో పాటు ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు తిన్నా.. మజిల్ పవర్ పెరుగుతుంది. ఇక పాల ఉత్పత్తులు ఏవి తీసుకున్నా కండబలం పెరుగుతుంది.
బీన్స్ తినాలి. ఇక సాల్మన్ లాంటి చేపలను తింటే కండరాల పుష్టి కలుగుతుంది.
ఎముకలు గట్టిపడాలంటే కాల్షియంతో పాటు విటమిన్- డి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తప్పని సరి. కాల్షియం శాతం అధికంగా ఉంటుంది. ఇక పెరుగులో ముప్ఫయిశాతం కాల్షియం ఉంటుంది. అందుకే పెరుగుతో చేసిన ఆహారం తీసుకోవాలి
కొత్తిమీర, నారింజ రసంలో కూడా కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా చేపలు తింటే కాల్షియంతో పాటు డి-విటమిన్ లభిస్తుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
బ్రొకోలి, గింజలు.. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తాలను తీసుకున్నా కాల్షియం, డి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఎముకల్లో బలం వస్తుంది.
విటమిన్ సి, పాస్ఫరస్ ఉండే అరటిపండ్లు తింటే తక్షణమే శక్తి వస్తుంది. ఇక ముఖ్యంగా అరటిపండ్లు ఎముకల గట్టితనానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే.. ఇందులో ఉండే బి-6 విటమిన్ వల్ల ఎముకల స్ర్టెంగ్స్‌కు ఉపయోగపడే ఎంజైమ్స్ విడుదలవుతాయి.
కండరాలు గట్టిపడాలని, ఎముకలు దృఢంగా ఉండాలని కేవలం ఆహారం మాత్రమే తింటే బరువు పెరుగుతారు. అందుకే వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. దీంతో పాటు కంటికి నిద్ర ఉండాలి. అప్పుడే ఆహారం వల్ల ఉపయోగం ఉంటుంది.
Updated Date - 2023-06-14T03:46:00+05:30 IST