Stone Fish : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-01-06T23:31:13+05:30

రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్‌ ఫిష్‌’ అని పిలుస్తారు.

Stone Fish : మీకు తెలుసా?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్‌ ఫిష్‌’ అని పిలుస్తారు.

ప్రపంచంలో ఉండే విషప్రాణుల్లో ఇవి ప్రమాదకరం. పాముకాటులానే ఉంటుంది. నొప్పి, రక్తస్రావంతో పాటు నాడుల మీద పనిచేసి కిందపడిపోవటం, గుండెపోటు లాంటివి సంభవిస్తాయి.

40 సెం.మీ ఉండే ఈ చేప ఎరుపు, పసుపు, నలుపు ఇలా వివిధ రంగుల్లో కనిపిస్తుంది. వాతావరణానికి తగినట్లు రంగుమారుతుంది. రాళ్లమధ్యలో ఉంటే రాయిలానే ఉంటుంది.

ఈ విషంతో ఇతర చిన్న జీవులను చంపి ఆరగిస్తుంది. ఇవి నెమ్మదిగా ఈదుతాయి. అయితే దాడి చేయాలనుకుంటే మాత్రం 0.015 సెకన్స్‌లోనే అవతలి జీవిని కొరికేస్తుంది.

నీళ్ల బయట పడితే రోజుపాటు జీవించగలవు. వీటి శరీరంపై ఉండే ప్రత్యేక కణ నిర్మాణం వల్లే ఇలా జీవించగలుగుతాయి.

ఇవి ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. బరువు సుమారు రెండు కేజీలుంటాయి.

వీటిని సముద్రంలోని పాములు వేటాడి తింటాయి. వీటి జీవనకాలం 5 సంవత్సరాలనుంచి 10 ఏళ్లు వరకూ!

ఏదైనా జీవి తన దగ్గరకు వస్తోందంటే తెలివిగా నటిస్తాయి. రాళ్లలో కలిసిపోయి కదలకుండా ఉంటాయి. చనిపోయిందేమోనన్న అనుమానం కలిగేలా ఉంటుంది. అయితే దాన్ని ఏ జీవి అయినా కెలికితే మాత్రం దాడి చేస్తుంది.

Updated Date - 2023-01-06T23:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising