Gas Cylinder: ఒకే ఒక్క టవల్‌తో.. గ్యాస్ సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం యమా ఈజీ..!
ABN, First Publish Date - 2023-08-09T16:06:06+05:30
గ్యాస్ సిలిండర్ ఎంత వరకూ ఖాళీగా ఉందో గుర్తించడానికి, సిలిండర్ దాని తడి, పొడి భాగాలను జాగ్రత్తగా చూడాలి.
వంట చేయడం అంటే ఓ ముప్ఫై సంవత్సరాల క్రితానికి వెళితే అప్పుడు పెద్దగా గ్యాస్ స్టవ్స్ ఎవరూ వాడేవారు కాదు. కొద్దిగా వంటైనా, పెద్ద వంటైనా కట్టెల పొయ్యినో, కిరోసిన్ పొయ్యినో వాడేవరు. అయితే కట్టెల పొయ్య, కిరోసిన్ వంటి వాటిని పక్కకు తోసేస్తూ వచ్చిన సాధనం గ్యాస్ స్టవ్. దీనికి నెలకో గ్యాస్ సిలెండర్ తగిలిస్తే ఎంత పెద్ద వంటనైనా సులువుగాచేసేయచ్చు. అయితే మునుపటిలా మరింత తీసుకోకుండా గ్యాస్‌ను వెలిగించడం ఆలస్యం నిమిషాల్లో వంట చేసి ఆహారాన్ని సిద్ధం చేసేయచ్చు.
అయితే సిలిండర్‌లోని గ్యాస్‌ను ఎప్పటికప్పుడు నింపాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు గ్యాస్ వెంటనే నింపడం సాధ్యం కానప్పుడు అలాంటి సమయంలో సింగిల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా, 15 నుంచి 16 కిలోల సిలిండర్‌లో నింపిన గ్యాస్ బరువు 14 కిలోల 200 గ్రాములు. ఈ సందర్భంలో, గ్యాస్ నింపిన తర్వాత, ట్యాంక్ బరువు 30 కిలోల 200 గ్రాములు ఉండాలి.అయితే అలాంటి బరువు ఉంటుందా.. మనదగ్గర దానిని తూచే వేయింగ్ మెషిన్ ఉండదుగా.. అందుకే ఇలా ట్రై చేయండి.
ఇది కూడా చదవండి: బాన పొట్ట కరగాలంటే.. ప్రతి రోజూ ఈ 6 అంశాలను పాటించండి చాలు.. కసరత్తులు చేయకుండానే..!
తడి టవల్‌తో గ్యాస్ స్థాయిని తనిఖీ చేయండి.
సిలిండర్‌లో గ్యాస్ ఎంతవరకూ ఉందో తనిఖీ చేయడానికి, దాని చుట్టూ ఒక తడి టవల్‌ను చుట్టండి. కొంతకాలం తర్వాత, గ్యాస్ ట్యాంక్ పైన తడిగా ఉంటే, తువ్వాళ్లను తీసేయండి. ఇప్పుడు సిలిండర్‌లో ఎంత భాగం ఎంతవరూ తడిగా ఉందో చూడండి.
గ్యాస్ స్థాయిని ఇలా గుర్తించండి.
గ్యాస్ సిలిండర్ ఎంత వరకూ ఖాళీగా ఉందో గుర్తించడానికి, సిలిండర్ దాని తడి, పొడి భాగాలను జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే దాని తడి భాగం గ్యాస్ ఉనికిని సూచిస్తుంది. ఈ పరీక్ష ద్వారా సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉంది అనేది సులువుగా తెలుసుకోవచ్చు.
ఈ ట్రిక్ ఎలా పని చేస్తుంది.
వంట సిలిండర్‌లో నింపిన గ్యాస్ పేరు LPG (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్). అంటే, గ్యాస్‌లో కొంత మొత్తంలో ద్రవం కూడా ఉంటుంది. చల్లని క్లాత్ వేయడం వల్ల సిలిండర్ లోని గ్యాస్ ఉన్నభాగం తడిగా ఉండి, మరో భాగం మామూలుగా ఆవిరి అయిపోతుంది. ఆ ట్రిక్ తో సిలిండర్ తో గ్యాస్ ను గుర్తించేలా చేస్తుంది. ఓ సారి ట్రై చేయండి.
Updated Date - 2023-08-09T16:06:06+05:30 IST