ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అఖిల్‌ కోసం కథ రెడీ!

ABN, First Publish Date - 2023-08-12T23:41:12+05:30

అక్కినేని హీరో అఖిల్‌కి ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కావడం లేదు. లవ్‌ స్టోరీలు, ఫాంటసీలు, యాక్షన్‌ డ్రామాలూ ఇలా ఏం చేసినా తనకు కలసి రాలేదు.....

అక్కినేని హీరో అఖిల్‌కి ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కావడం లేదు. లవ్‌ స్టోరీలు, ఫాంటసీలు, యాక్షన్‌ డ్రామాలూ ఇలా ఏం చేసినా తనకు కలసి రాలేదు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ‘ఏజెంట్‌’ సైతం బోర్లా పడింది. ఈ ఫ్లాప్‌తో అఖిల్‌ మరింత ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఏ జోనర్‌లో సినిమా చేయాలి? ఏ దర్శకుడ్ని ఎంచుకోవాలి? అనే విషయాల్లో తీవ్ర తర్జనభర్జనల్లో ఉన్నాడు. తన దృష్టి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై పడిందని టాక్‌. కుటుంబ కథా చిత్రంలో నటిస్తే.. సేఫ్‌ జోనర్‌ అవుతుందని భావిస్తున్నాడట. ఈ తరహా కథలకు శ్రీకాంత్‌ అడ్డాల కేరాఫ్‌ అడ్రస్‌. శ్రీకాంత్‌ కూడా ఓ మంచి ప్రాజెక్ట్‌, కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘పెదకాపు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఆ తరవాతి ప్రాజెక్ట్‌ అఖిల్‌తో ఉండొచ్చని టాక్‌. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంబోపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-08-12T23:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising