ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత గొంతుక

ABN, First Publish Date - 2023-04-26T02:10:54+05:30

‘‘రాజకీయాల్లోకి వస్తే ఆస్తులు పెరుగుతాయంటారు. రాజకీయాలనేవి ప్రజా సేవ చేయడానికి. మరి సేవ చేస్తే ఆస్తులు తరగాలే కానీ పెరగకూడదు కదా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఐటీలో చదివి... కార్పొరేటు కొలువులు వద్దనుకుని... సొంత ఊరు బాట పట్టారు. సామాజిక కార్యకర్తగా... యువ నాయకురాలిగా... నిత్యం జనం మధ్యే ఉంటూ... వారిలో చైతన్యం రగిలిస్తున్నారు దాసరి ఉష. ప్రజా చైతన్యంతోనే మార్పు సాధ్యమని నమ్మి... అటు వైపు అడుగులు వేస్తున్న ఆమె... తన ప్రయాణం గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు...

‘‘రాజకీయాల్లోకి వస్తే ఆస్తులు పెరుగుతాయంటారు. రాజకీయాలనేవి ప్రజా సేవ చేయడానికి. మరి సేవ చేస్తే ఆస్తులు తరగాలే కానీ పెరగకూడదు కదా! మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు. వాటిని పట్టించుకొని పరిష్కరించేవారు, నిస్వార్థంగా పని చేసి, ఆదర్శంగా నిలిచే నాయకులు ఎంతమంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం వెతుక్కొంటూ నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. అంతేకాదు... వివక్ష లేని సమాజ నిర్మాణం జరగాలంటే ఈ వ్యవస్థ మారాలి. ఆ మార్పు రాజకీయాలతోనే తేగలుగుతామని బలంగా నమ్మాను కనుకనే ప్రజా క్షేత్రంలోకి దిగాను. ఈ ఆకాంక్ష ఇవ్వాల్టిది కాదు. నేను ఐఐటీ- ఖరగ్‌పూర్‌లో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లోనే నా దారి ఇదేనని నిర్ణయించుకున్నాను. ప్రజా సేవ చేయాలనేది నా జీవితాశయం.

ఆరు నెలలు అధ్యయనం...

నాయకురాలిని కావాలంటే నా ప్రాంతం, నా ప్రజల స్థితిగతులు క్షుణ్ణంగా తెలియాలి. వాళ్ల కష్టాలు, బాధలు అర్థం చేసుకోవాలి. సమస్యలకు పరిష్కారం ఎలా చూపాలి? ఎలాంటి వ్యక్తులతో నడవాలి? ఇవన్నీ తెలుసుకొంటే సమాజంతో పాటు నేనూ ఎదగడానికి, లోతైన అవగాహనకు దోహదపడతాయి. దాని కోసం మా ఊరు వచ్చాక పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఆరు నెలలు విస్తృతంగా తిరిగాను.

ఆ వివక్ష చూశాను...

ఇక్కడ నేను చూసిన మరో ప్రధాన సమస్య... కుల వివక్ష. దాని ప్రభావం మా ఆశయానికి కూడా అడ్డుగా నిలిచింది. ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టాలన్నది మా కల. దానివల్ల ఊళ్లో వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. విద్య, వైద్యం కూడా ఉచితంగా అందించాలనుకున్నాం. మా అమ్మ పద్మ, నాన్న హనుమయ్యలు కనగర్తి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. శిథిలమైపోయిన ఒక ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.50 లక్షలతో పునర్నిర్మించాం. అలాగే మా గ్రామంలో ఉచిత కరెంట్‌, నీళ్ల సదుపాయాల కోసం పదేసి లక్షల చొప్పున ఖర్చు చేశాం. అంతా మా సొంత డబ్బే. ఊరుకు అంత చేసినా మేం పరిశ్రమ నెలకొల్పాలనుకున్నప్పుడు కొందరు స్థానిక నాయకులు అడ్డుపడ్డారు. కారణం... మేం బీసీలం కావడమే! ఇక్కడ ఎక్స్‌ప్లోజివ్స్‌ బిజినెస్‌ అంటే అగ్రవర్ణాలకే పరిమితమయ్యేది. ఒకప్పుడు రిక్షా పుల్లర్‌ అయిన మా నాన్న కష్టపడి నేడు ఈ స్థాయికి వచ్చారు. అది వాళ్లకు నచ్చలేదు. ఎన్నో రకాలుగా పోరాడాం. కోర్టుకు వెళ్లాం. తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా పడనివ్వలేదు. కులవివక్షతో జరిగిన కుట్ర అది. అక్క ఐఐటీ ధన్‌బాద్‌లో చదివింది. తమ్ముడు ఎన్‌ఐటీ రూర్కెలాలో చదివాడు. నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివాను. అందరం మంచి చదువులే చదివాం. ఒక పరిశ్రమ పెట్టడానికి కావల్సిన అన్ని అర్హతలూ మాకు ఉన్నాయి.

వారే స్ఫూర్తి...

నా జీవితంలో నన్ను బాగా ప్రభావితం చేసింది మా అమ్మానాన్నలే. నేను ఇటువైపు రావడానికి స్ఫూర్తి కూడా వారే. నాకు రాజకీయాలపై అవగాహన కల్పించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ కన్నా ఒక రాజకీయ నాయకుడు తలుచుకొంటే ఈ సమాజానికి ఎంతో మేలు చేయగలడని నాకు తెలియజెప్పారు. వాళ్ల మద్దతు, సహకారమే నన్ను ఇక్కడి వరకు నడిపించింది. వారి ప్రోత్సాహం వల్లే నేను చదువుకునే రోజుల నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఐఐటీలో తోటి విద్యార్థులతో కలిసి ‘గోపాలి యూత్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ నెలకొల్పి, దాని ద్వారా ఖరగ్‌పూర్‌లో ఒక ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నడిపించాం. అందులో ఉచిత విద్య అందించేవాళ్లం. పెద్దపల్లికి వచ్చిన తరువాత కూడా అలాంటి కార్యక్రమాలే కొనసాగించాను. అది కరోనా సమయం కావడంతో 60 గ్రామాల్లోని పాఠశాలల్లో ఉచితంగా ట్యూషన్స్‌ ఏర్పాటు చేశాం. డిగ్రీ, పీజీ చదివిన అమ్మాయిలను సంప్రతించి, వారికి నెలకు ఇంతని ఇచ్చి, పాఠాలు చెప్పించాం. ఒక్కో సెంటర్‌లో 40 మంది విద్యార్థులు ఉండేవారు. ఆరు నెలలు బాగానే నడిచాయి. అయితే ఆపేయమని డీఈఓ నుంచి ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్‌ అనుమతి ఇచ్చినా డీఈఓ ఒప్పుకోలేదు. బహుశా రాజకీయ ఒత్తిళ్లే కారణం కావచ్చు.

డేటా సైన్స్‌లో శిక్షణ...

ప్రస్తుతం మా అమ్మానాన్న పేరు మీద ‘పద్మా హనుమయ్య ఫౌండేషన్‌’ ద్వారా ఉచితంగా విద్య అందిస్తున్నాం. 120 మందికి డేటా సైన్స్‌లో శిక్షణ ఇచ్చాం. వాళ్లందరికీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశాం. ఇప్పుడు వాళ్లలో చాలామంది హైదరాబాద్‌లోని మంచి కంపెనీల్లో పని చేస్తున్నారు. 5.5 లక్షల ప్యాకేజీతో చేరినవారు కూడా ఉన్నారు. మా ఫౌండేషన్‌ నుంచి ఎవరు వెళ్లినా... వారు సహకరించాలనే కండిషన్‌ పెట్టాం. అంటే సమాజానికి తిరిగి ఇవ్వడం నేర్పిస్తున్నాం. అలా వాళ్లు కూడా చాలామందికి శిక్షణ ఇస్తున్నారు.

విద్య, వైద్యం, ఉపాధి...

ఇవే నా ప్రధాన లక్ష్యాలు. ఈ నినాదంతోనే జనం మధ్యకు వెళుతున్నా. మా ప్రాంతంలో పరిశ్రమలు లేవు. రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదు. కానీ వరి, పత్తి లాంటి పంటలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. అలాంటప్పుడు వాటి నుంచి తయారయ్యేవి కూడా ఇక్కడే ఉత్పత్తి అయితే రైతు, యువత లబ్ధి పొందుతారు. రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొన్ని వస్తువుల మీదైనా ‘మేడ్‌ ఇన్‌ పెద్దపల్లి’ అని ఉండాలనేది నా కోరిక. కానీ ఇక్కడ దళారి లబ్ధి పొందుతున్నాడు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన జరగాలి. అలాగే ఉపాధి. ఇక్కడ లక్ష మందికి పైగా మహిళలు ఉన్నారు. ఊరికో కుటీర పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రతి మహిళకూ ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండేళ్లకోసారి ఉచితంగా ఫుల్‌ బాడీ చెకప్‌ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వీటిల్లో అసాధ్యాలేమీ లేవు.’’

యువత రావాలి...

యువత రాజకీయాలంటే ఆసక్తి చూపడంలేదనేది సరికాదు. వాళ్లకు ఆసక్తి ఉంది. అయితే ధనబలం ఉంటే తప్ప ఇందులో నిలబడలేమనే భయం వారిని వెంటాడుతోంది. సామాజిక మాధ్యమాల్లో నా పోస్టింగ్స్‌ చూసి మా స్నేహితులు అడుగుతుంటారు... ‘రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కానీ నా దగ్గర డబ్బు లేదు... ఎలా’ అని! వాళ్లకు ఒకటే చెబుతుంటాను... ‘ప్రజా సేవకు డబ్బు కాదు ముఖ్యం. ఇందులోకి వస్తున్నావంటే ఎన్నో త్యాగం చేయాలి’ అని. ‘మీ భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు బాగుండాలంటే మీరు రాజకీయాల్లోకి రావాలి’ అని వెళ్లిన చోటల్లా యువతకు చెబుతుంటాను.

హనుమా

Updated Date - 2023-04-26T02:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising