ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pressure Cooker: కుక్కర్‌లో వంట చేసే అలవాటుందా..? అయితే వీటిని మాత్రం దాంట్లో అస్సలు ఉడికించకండి..!

ABN, First Publish Date - 2023-06-30T14:33:17+05:30

చేపల్ని కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు.

Potato
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్త త్వరగా వంట అయిపోవాలన్నా, గ్యాస్, సమయం కలిసి రావాలన్నా ప్రెషర్ కుక్కర్ మీద వంట చేయడం అనేది చాలా సులువైన మార్గం. ఇప్పటి రోజుల్లో చాలామంది దీనినే వాడుతున్నారు. ఇదే లెక్కతో ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్‌ని ప్రతి ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆహారం చాలా త్వరగా ఉడుకుతుంది, అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కానీ మీకు తెలుసా, ప్రెషర్ కుక్కర్‌లో దూరంగా ఉండవలసిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇందులో ఆహారాన్ని వండటం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగించవచ్చట. దీని కారణంగా జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ప్రెషర్ కుక్కర్‌లో వండకుండా ఏ ఆహార పదార్థాలను నివారించాలో తెలుసుకుందాం.

బంగాళదుంప

బంగాళాదుంపతో చాలా రకాల వంటకాలు చేయచ్చు. ముఖ్యంగా కూరలు, వేపుళ్ళు, క్రంచీ ఫ్రైలు చేయడానికి బంగాళ దుంపను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. బంగాళాదుంపలను ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బంగాళదుంపల్లో ఎక్కువ భాగం పిండి పదార్ధాలు ఉండటం వల్ల దీనిని ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిదికాదట.

పాస్తా

పాస్తాను ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టినా అది ఆరోగ్యానికి హానికరం. ప్రెషర్ కుక్కర్‌లో వండకుడదు. దానిని పాన్లో ఉడకబెట్టాలి. కుక్కర్‌లోని పాస్తాలో పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

ఇది కూడా చదవండి: మూత్రానికి వెళ్లినప్పుడల్లా.. ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. క్షణం కూడా ఆలస్యం చేయకండి..!

చేప

చేపల్ని కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. చేప చాలా మృదువుగా ఉంటుంది, కుక్కర్లో ఉడికించినట్లయితే, ఎక్కువ చితికిపోయే అవకాశం ఉంది. దీనివల్ల చేపలు రుచి లేకుండా తయారవుతాయి.

కూరగాయలు

సీజనల్ కూరగాయలలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు, ఎందుకంటే ఈ కూరగాయలలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు పూర్తిగా నాశనమవుతాయి. కాబట్టి కొన్ని పదార్థాలకు మాత్రమే ప్రెజర్ కుక్కర్ని వాడటం మంచిది. మరీ ఎక్కువగా ఉడికించి తయారు చేసే పదార్థాలలో పోషకాలు ఉండవు సరికదా ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు.

Updated Date - 2023-06-30T14:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising