Heart Stroke Risk: బ్లడ్ గ్రూప్‌ను బట్టి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందో.. లేదో చెప్పేయొచ్చట.. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకు హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువట..!
ABN, First Publish Date - 2023-02-20T13:01:06+05:30
మన బ్లడ్ గ్రూప్‌ను బట్టి కూడా హార్ట్ అటాక్ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకు హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ అనేది కూడా చెప్పేస్తున్నారు
Heart Stroke Risk: మన బ్లడ్ గ్రూప్‌ను బట్టి కూడా హార్ట్ అటాక్ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకు హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ అనేది కూడా చెప్పేస్తున్నారు. మనకు స్ట్రోక్ త్వరగా వచ్చే ప్రమాదాన్ని బట్టి మన రక్తం వర్గాన్ని అంచనా వేయవచ్చట. ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవించినప్పుడు మాత్రం మెదడులోని కొంత భాగానికి రక్తం సరఫరా తగ్గడమో లేదంటే అంతరాయం ఏర్పడటమో జరుగుతుంది. ఇది మెదడు కణజాలం ఆక్సిజన్, ఇతర పోషకాలను అందనివ్వకుండా చేస్తుంది. దీనివల్ల మెదడు కణాలు నిమిషాల్లో చనిపోతాయి.
రక్త రకాలు ఏమిటి?
రక్త రకాలు ఎర్ర రక్త కణాల ఉపరితలంపై యాంటీబాడీలు, వారసత్వంగా వచ్చిన యాంటీజెనిక్ పదార్థాలు వంటి విస్తృత శ్రేణి రసాయనాల ఉనికి లేదంటే అసలు లేకపోవడం ఆధారంగా రక్తాన్ని వర్గీకరించడం జరుగుతుంది. 4 ప్రధాన బ్లడ్ గ్రూప్స్ వచ్చేసి.. A, B, AB, O. ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ వారి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన జన్యువుల ద్వారా నిర్ణయించబడుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
ఇతర బ్లడ్ గ్రూపులతో పోల్చినప్పుడు.. టైప్ A రక్తం ఉన్నవారు 60 ఏళ్లలోపు స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. A1 సబ్ గ్రూప్‌కు ఎర్లీ-ఆన్‌సెట్ స్ట్రోక్‌కి సంబంధించిన జన్యువుతో సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది.
A గ్రూప్ వారికే ఎందుకంత రిస్క్?
A బ్లడ్ గ్రూప్ వారికే అంత రిస్క్ ఎందుకని తమకు కూడా తెలియదని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ రచయిత, వాస్కులర్ న్యూరాలజిస్ట్ స్టీవెన్ కిట్నర్ చెప్పారు. రక్త నాళాలను లైన్ చేసే ప్లేట్‌లెట్స్, కణాలు, రక్తం గడ్డ కట్టడం వంటి కారకాలతో దీనికి ఏదైనా సంబంధం ఉండొచ్చని కిట్నర్ తెలిపారు.
రక్తం రకం, గుండె జబ్బుల ప్రమాదంపై అధ్యయనం
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇటీవల జరిపిన పరిశోధన ప్రకారం.. O బ్లడ్ గ్రూప్ ఉన్న వారితో పోలిస్తే.. A, B, లేదా AB బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు మరింత ఎక్కువ ప్రమాదమని పరిశోధకులు కనుగొన్నారు.
Updated Date - 2023-02-20T13:04:56+05:30 IST