Dreaming about Money: కలలో డబ్బు కనిపించిందా..? నోట్లను లెక్కిస్తున్నట్టు కల వస్తే దాని అర్థమేంటంటే..
ABN, First Publish Date - 2023-09-19T16:36:16+05:30
కలలో లాటరీని గెలవడం అనేది పరిస్థితులలో తీవ్రమైన మార్పు కోసం కోరిక, అభివ్యక్తి కావచ్చు.
డబ్బుకి సంబంధించి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా ధనవంతులమయిపోయామని, లేదా కార్లు, బంగళాలు వచ్చేసినట్టు. లాటరీ తగిలినట్టు, ఆలోచింది అదే రాత్రికి కలలా కంటూ ఉంటాం. అయితే ఇలా రాత్రి నిద్దురలో వచ్చే కలలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కలలో ఏ దృశ్యం కనిపిస్తే అది కొత్తగా ఏదో జీవితంలోకి తీసుకువస్తుందనే ఆలోచనలో ఉంటారు ప్రతి ఒక్కరూ..అసలు కలలో డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
డబ్బు కనిపిచడం..కలలో డబ్బు కనిపించడం అంటే కొత్త అవకాశాలు, ఇది ఊహించని లాభాలను సూచిస్తుంది, అది ఆర్థిక, వ్యక్తిగత వృద్ధిని సూచిస్తుంది.
డబ్బును పోగొట్టుకోవడం: డబ్బును కోల్పోయే కలలు ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత నష్టాల భయాన్ని సూచిస్తాయి.
డబ్బును లెక్కించడం: కలలో డబ్బును లెక్కించడం అనేది ఆర్థిక నిర్వహణ, ఫైనాన్స్‌పై మరింత నియంత్రణనను సూచిస్తుంది.
డబ్బు దొంగిలించడం: డబ్బును దొంగిలించాలని కలలు కనడం అపరాధం, అభద్రతను సూచిస్తుంది.
డబ్బు ఇవ్వడం, తీసుకోవడం : ఈ కలల్లో డబ్బు ఇవ్వడం ఇతరులకు సహాయం చేయాలనే కోరికను ప్రతిబింబిస్తుంది.
ఖాళీ వాలెట్, దివాలా: ఖాళీ వాలెట్, దివాళా తీసిన కలలు జీవితంపై అసమర్థత, వైఫల్యం భయం, నియంత్రణ కోల్పోవడం వంటి భావాలను ప్రతిబింబిస్తాయి.
ఇది కూడా చదవండి: రాత్రి భోజనం తర్వాత చేస్తున్న ఈ 3 బ్లండర్ మిస్టేక్స్ వల్లే..
లాటరీని గెలవడం: కలలో లాటరీని గెలవడం అనేది పరిస్థితులలో తీవ్రమైన మార్పు కోసం కోరిక, అభివ్యక్తి కావచ్చు.
మితిమీరిన సంపద: అధిక సంపద, ఐశ్వర్యం కలలు మరింత సౌకర్యవంతమైన జీవితం కోసం ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలను బహిర్గతం చేస్తాయి.
Updated Date - 2023-09-19T16:36:16+05:30 IST