Plants Water: మొక్కలకు నీరు ఎలా పోయాలి?
ABN, First Publish Date - 2023-06-14T03:47:25+05:30
వేసవి తాపం ఇంకా తగ్గలేదు. వేడికి మనుషులే తట్టుకోలేక వీలైనన్ని నీళ్లు తాగుతుంటే- మొక్కల పరిస్థితి ఏమిటి? వేడిగా ఉందని ఎక్కువ నీళ్లు పోస్తే మొక్కలు బతుకుతాయా? అసలు మొక్కలను ఎలా కాపాడుకోవాలి?లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం..
వేసవి తాపం ఇంకా తగ్గలేదు. వేడికి మనుషులే తట్టుకోలేక వీలైనన్ని నీళ్లు తాగుతుంటే- మొక్కల పరిస్థితి ఏమిటి? వేడిగా ఉందని ఎక్కువ నీళ్లు పోస్తే మొక్కలు బతుకుతాయా? అసలు మొక్కలను ఎలా కాపాడుకోవాలి?లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం..
అవసరాలు తెలుసుకోండి..
వేర్వేరు మొక్కలకు నీటి అవసరం వేరుగా ఉంటుంది. మొక్క జాతి, వయస్సు ఆధారంగా నీటి అవసరాలుంటాయి. తేమ తక్కువగా ఉండి.. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలకు ఎక్కువ నీళ్లు అవసరమవుతాయి. అందువల్ల నీళ్లుపోసే ముందు మొక్క అవసరాన్ని తెలుసుకోవటం మంచిది.
మట్టి ముఖ్యమే..
మొక్కలు పెరిగే మట్టి ఎప్పుడూ తడిగా ఉండాలి. అలాగని ఎక్కువ నీళ్లు ఉండకూడదు. నేల పొడిగా ఉంటే మొక్కలు త్వరగా చనిపోయే అవకాశముంటుంది. అందువల్ల మొక్కలకు నీళ్లు పోసే ముందు- మట్టి ఎలా ఉందనే విషయాన్ని గమనించాలి. అవసరమైతేనే నీళ్లు పోయాలి. కొందరు మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పోసేస్తూ ఉంటారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
నీళ్లు పోసే పద్ధతి..
వేరు భాగం తడిసేలా నీళ్లు పోయాలి. దీని వల్ల మొక్కకు తగినన్ని నీళ్లు అందుతాయి. గుబురుగా పెరిగిన చెట్ల ఆకులపై నీళ్లు పోయటం వల్ల ఫంగ్‌సలు వ్యాపిస్తాయి. అందువల్ల మొక్క గుబురుగా పెరిగినా- వేరు భాగం తడిసేలా నీళ్లు పోయటమే మంచిది.
ఏ సమయంలో..
మొక్కలకు నీళ్లు ఉదయం లేదా సాయంత్రం పోయాలి. మధ్యాహ్నం మాత్రం పోయకూడదు. అంతే కాకుండా ప్రతి రోజూ ఒకే సమయంలో నీళ్లు పోయటం కూడా మంచిది. దీని వల్ల వేర్లకు నీరు ఒక క్రమపద్ధతిలో అంది- మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
Updated Date - 2023-06-14T03:47:25+05:30 IST