ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Black Water : కోహ్లీతో సహా కొందరు సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తెగ తాగుతుంటారు.. ఆ వాటర్ అంటే వాళ్లకు ఎందుకంత పిచ్చంటే..

ABN, First Publish Date - 2023-02-18T12:44:34+05:30

మనిషి జీవితంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనిషి శరీరంలో 70 శాతం నీరే ఉంటుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపడం, బీపీని మెయిన్‌టైన్ చేయడం, లూబ్రికేటింగ్ జాయింట్స్ తదితర పనులను నీళ్లు నిర్వహిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Black Water : మనిషి జీవితంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనిషి శరీరంలో 70 శాతం నీరే ఉంటుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపడం, బీపీని మెయిన్‌టైన్ చేయడం, లూబ్రికేటింగ్ జాయింట్స్ తదితర పనులను నీళ్లు నిర్వహిస్తాయి. తగినంత నీరు తీసుకోవడం వల్ల బాడీ డీ హైడ్రేషన్‌‌కు గురి కాకుండా ఉంటుంది. నీటిలో సాధారణంగా ఇన్‌ఆర్గానిక్ లవణాలు ఉంటాయి. ఇక బ్లాక్ వాటర్ లేదా ఆల్కలీన్ బ్లాక్ వాటర్ గురించి మీకు తెలుసా? దీనిని ఇండియన్ ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహా కొందరు సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తెగ తాగుతుంటారు. మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆల్కలీన్ నీరు దీర్ఘకాలిక విరేచనాలు, హైపర్‌ ఎసిడిటీ, అజీర్ణం, ఎముక, గుండె ఆరోగ్యం, మధుమేహం వంటి జీర్ణ సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా ఉంది.

బ్లాక్ వాటర్ తాగడం వలన ప్రయోజనాలేంటి?

  1. ఆల్కలీన్ బ్లాక్ వాటర్ వ్యాయామం తరువాత డీ హైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. రక్తం చిక్కబడటం, రీహైడ్రేషన్‌పై బ్లాక్ ఆల్కలీన్ లేదా అధిక pH నీరు ఎలా పనిచేస్తుందనే విషయమై ఓ అధ్యయనం జరిగింది. వ్యాయామం తర్వాత నల్ల నీరు రక్త చిక్కదనాన్ని గణనీయంగా తగ్గించిందని అధ్యయనంలో తేలింది. అయితే రీహైడ్రేషన్‌కు ఎటువంటి తేడా లేదు.

  2. అంతేకాకుండా బ్లాక్ వాటర్ వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదట. అలాగే మన జీవితకాలాన్ని మరింత పెంచుతుంది.

  3. ఆల్కలీన్ వాటర్ తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి HbA1c, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఆల్కలీన్ వాటర్ ప్యాంక్రియాటిక్ బీటా కణాలకు వ్యతిరేకంగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది. తద్వారా మధుమేహంలో అదుపులో ఉంటుంది.

  4. ఆల్కలీన్ వాటర్ తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావం నిరోధించడం, గాల్ బ్రాడర్‌ను ఖాళీ చేయడం, శరీరం నుంచి టాక్సిన్స్‌ను తొలగించడం వంటివి చేస్తుంది.

  5. ఆల్కలీన్ నీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది హృదయ సంబంధ వ్యాధులు, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్‌ రాకుండా చేయడంతో పాటు మొత్తం మరణాల రేటును తగ్గిస్తుంది.

  6. బ్లాక్ వాటర్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

  7. ఆల్కలీన్ వాటర్ అలసటను నివారించడమే కాకుండా ఆటలాడే సమయంలోయాక్టివ్‌గా ఉంచుతుంది.

బ్లాక్ వాటర్ వలన ఇబ్బందులు..

  1. బ్లాక్ వాటర్‌ను తీసుకోవడం వల్ల ప్రయోజనాలూ ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు ఈ నీళ్లలో pH లెవల్స్ మారే అవకాశం ఉంది. ఇలా మారినప్పుడు వికారం, వాంతులు కావడం వంటివి జరగవచ్చు.

  2. అయితే బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల రక్తంలోని pHలో మార్పులు వచ్చే అవకాశం లేదని, కానీ యూరినరీ పీహెచ్‌లో మార్పులకు కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

  3. ఆల్కలీన్ ఆధారిత ఫుడ్ ఆప్షన్స్, సప్లిమెంట్లు, ఆల్కలైజ్డ్ వాటర్‌కి మారడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధిని నివారించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తామని ప్రమోటర్‌లు చెబుతుండటంతో ఈ నీటి వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కానీ ప్రమోటర్స్ చెప్పేదానికి సపోర్ట్ చేయడానికి నమ్మదగిన క్లినికల్ రిసెర్చ్‌లు ఏమీ లేకపోవడం గమనార్హం.

Updated Date - 2023-02-18T12:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising