కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mask : మాస్క్‌ను ధరించండి ఇలా!

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:15 PM

కోవిడ్‌ మళ్లీ వ్యాపిస్తోంది. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రకరకాల మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ మాస్కులేమిటో చూద్దాం.

Mask : మాస్క్‌ను ధరించండి ఇలా!

కోవిడ్‌ మళ్లీ వ్యాపిస్తోంది. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రకరకాల మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ మాస్కులేమిటో చూద్దాం.

ఎన్‌95

ఈ మాస్కులు వైరస్‌ల నుంచి రక్షణను ఇస్తాయి. ఇవి సర్జికల్‌, గుడ్డ మాస్కుల కన్నా మంచివని నిపుణులు పేర్కొంటున్నారు గుడ్డ మాస్కులు

మాట్లాడేటప్పుడు నోటి తుంపరలు బయటకు రాకుండా.. జలుబు ఉన్నప్పుడు వైరస్‌ వ్యాపించకుండా ఈ గుడ్డ మాస్కులు ఉపకరిస్తాయి. అదే విధంగా ఇతరుల నుంచి వైరస్‌లు సోకకుండా కూడా ఇవి ఉపకరిస్తాయి. అయితే వీటిని జాగ్రత్తగా ధరించాలి. ప్రతి రోజు వీటిని ఉతకాలి.

సర్జికల్‌ మాస్క్‌లు

ఈ మాస్కులు ఒక్క సారి ధరించటానికి మాత్రమే పనికొస్తాయి. బయట నుంచి వైరస్‌లు రాకుండా ఇవి ఉపకరిస్తాయి.

ఫేస్‌ షీల్డ్స్‌

మాస్కులతో పోలిస్తే వీటి ప్రయోజనం చాలా తక్కువ. వీటిని ధరించటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

మాస్కులు ధరించే ముందు...

చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోండి.

మాస్కును సగం సగం ధరించకండి

మాస్కును ధరించినప్పుడు ఎటువంటి ఖాళీలు ఉండకుండా చూసుకోండి ఒక సారి ధరించిన తర్వాత- దానిని తీయవద్దు.

Updated Date - Dec 23 , 2023 | 11:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising