కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guava : బరువును తగ్గించే జామ

ABN, First Publish Date - 2023-11-08T01:19:38+05:30

సీజనల్‌ ఫ్రూట్స్‌లో జామ కతే వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఇందులో విటమిన్‌-సి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గుల్లాంటివి దరిచేరవు. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

Guava : బరువును తగ్గించే జామ

  • సీజనల్‌ ఫ్రూట్స్‌లో జామ కతే వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఇందులో విటమిన్‌-సి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గుల్లాంటివి దరిచేరవు. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

  • డయాబెటిస్‌తో బాధపడేవారూ తినొచ్చు. విటమిన్‌-ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికెంతో మంచిది.

  • ఈ పండు తినటం వల్ల సోడియం, పొటాషియం పాళ్లు సమతూకంగా ఉంటాయి. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌కు గురికాకుండా బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. ఇందువల్ల గుండెకు సంబంధించిన సమస్యలురావు.

  • జామ ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి. టూత్‌పేస్ట్‌లా పని చేస్తాయి. ఎలాగంటే జామాకులు నమిలితే నోటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీనివల్ల నోరు శుభ్రంగా ఉంటుంది.

  • కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

  • జామ పండు తింటే శక్తి వస్తుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు తక్కువ.

  • జామలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో జామపండు ఉండాల్సిందే.

  • నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. జుట్టు పెరుగుతుంది.

Updated Date - 2023-11-08T01:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising