Neam Benefits: జుట్టుకో, ముఖానికో రాసుకుని ఉంటారు కానీ.. వేపాకుల పొడిని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే..!
ABN, First Publish Date - 2023-07-13T15:48:00+05:30
వానాకాలంలో ఇంటి పరిసరాల్లో తిరిగే క్రిమి కీటకాదులను కూడా వేపాకు సరిగ్గా పనిచేస్తుంది.
చర్మ సంరక్షణ, చర్మవ్యాధులకు వేపాకు చక్కని నివారణగా ఉపయోగపడింది. అదే విధంగా ఒత్తైన జుట్టుకు, చుండ్రు నివారణకు, జుట్టు సంరక్షణ సమస్యలకు వేప ఆకులను ఉపయోగించడం మంచిది. దీని పేస్ట్ జుట్టు, ముఖానికి సంబంధించిన సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ ట్రైగ్లిజరైడ్స్, విటమిన్ E వృద్ధాప్యాన్ని నివరిస్తాయి. చర్మంపై ఉండే ముడతలు, ముదురు మచ్చలను వేప తగ్గిస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది.
అలాగే వానాకాలంలో ఇంటి పరిసరాల్లో తిరిగే క్రిమి కీటకాదులను కూడా వేపాకు సరిగ్గా పనిచేస్తుంది. ఇంట్లో బ్యాక్టీరియాను నాశనం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఎండిన వేపాకులు..
కొన్ని పొడి వేప ఆకులను తీసుకోవాలి, మిక్సర్ గ్రైండర్లో రుబ్బుకోవాలి. ఎండు ఉల్లిపాయ తొక్కలు, 2 నుండి 4 లవంగాలు, కర్పూరం కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి. ఇప్పుడు వాటిని వేప మిశ్రమంలో కలిపి బాక్సులో భద్రపరుచుకోవాలి.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో అన్ని ఇళ్లలోనూ ఇదే సమస్య.. ఎండ అసలే లేకున్నా.. దుస్తులు త్వరగా ఆరిపోవాలంటే..!
ప్రతిరోజూ సాయంత్రం మట్టి దీపంలో ఆవాల నూనె వేసి, ఈ మిశ్రమాన్ని దీపంలో కలపాలి. దూదిని ఉంచి దీపంలా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంటి పరిసరాలలో తిరిగే బొద్దింకలు, దోమలతో పాటు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా పెరగదు.
Updated Date - 2023-07-13T15:48:00+05:30 IST