ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: వామ్మో..ఎన్నారై బాలిక! 15 ఏళ్లకే సొంత సంస్థ ఏర్పాటు..ఇప్పుడామె రేంజ్ తెలిస్తే..

ABN, First Publish Date - 2023-10-12T16:56:36+05:30

పదిహేనేళ్ల వయసులోనే సొంత సంస్థ ఏర్పాటు.. ఏడాది తిరిగే సరికల్లా రూ.100 కోట్ల విలువైన సంస్థగా అభివృద్ధి.. ప్రస్తుతం ఆమె సంస్థలో పది మంది టెకీల ఉద్యోగం.. ఇదీ ఇప్పటివరకూ సాగిన ఓ ఎన్నారై బాలిక ప్రస్తానం. నేటి కృత్రిమ మేధ యుగంలో యువత ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో చెప్పేందుకు ఈ బాలిక చక్కని ఉదాహరణ.

ఎన్నారై డెస్క్: పదిహేనేళ్ల వయసులోనే సొంత సంస్థ ఏర్పాటు.. ఏడాది తిరిగే సరికల్లా రూ.100 కోట్ల విలువైన సంస్థగా అభివృద్ధి.. ప్రస్తుతం ఆమె సంస్థలో పది మంది టెకీల ఉద్యోగం.. ఇదీ ఇప్పటివరకూ సాగిన ఓ ఎన్నారై బాలిక ప్రస్తానం. నేటి కృత్రిమ మేధ యుగంలో యువత ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో చెప్పేందుకు ఈ బాలిక చక్కని ఉదాహరణ. ఈ టీనేజర్ పేరు ప్రాంజల్ అవస్థీ. ఉండేది అమెరికాలో(16 year old indian girl's AI startup in america valued at rs 100 crore )!

Viral: నన్నేం చేయమంటారో మీరైనా చెప్పండి..నెట్టింట వ్యక్తి అర్థింపు.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌‌టాప్ ఆర్డరిచ్చాక..

ప్రాంజల్ అవస్థీ(Pranjal awasthi) ఇండియాలోనే పుట్టింది. ఏడేళ్ల వయసులోనే ఆమె ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది. తండ్రే ఆమెకు కంప్యూటర్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. తండ్రి అడుగుజాడల్లో ఆమె వేగంగా కోడింగ్‌పై పట్టుసాధించింది. కంప్యూటర్ ప్రపంచంపై ఆమె ఆసక్తి వేలరెట్లు పెరిగిపోయింది. ప్రాంజల్‌కు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులతో అమెరికాకు(USA) వెళ్లింది. అది ఆమెకు కొత్త ప్రపంచం పరిచయం చేసింది. కొత్త అవకాశాల ద్వారాలను తెరిచింది. అక్కడ కంప్యూటర్, గణిత క్లాసులకు హాజరై ఆమె కోడింగ్‌లో రాటుతేలింది. ఆమెకు 13 ఏళ్లు ఉన్నప్పుడు చాట్‌జీపీటీ-3 వర్షన్ విడుదలైంది. ఈ క్రమంలోనే ఏఐ సామర్థ్యాలను అపారమైన ఆన్‌లైన్ డాటా విశ్లేషణ‌కు ఉపయోగించుకోవచ్చన్న ఆలోచన ఆమెకు కలిగింది.

Viral: రాత్రి 10 గంటల.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మద్యం సేవించేందుకు రెడీ అయిన యువకుడు.. వంటింట్లోంచి ఐస్ క్యూబ్స్ తెచ్చాక దారుణం..


ఆ తరువాత, మియామీలోని అంకుర సంస్థల ఏర్పాటు, అభివృద్ధిని ప్రోత్సహించే యాక్సెలరేటర్ కార్యక్రమంలో ప్రాంజల్‌కు చోటు దక్కింది. దీంతో, ఆమె కెరీర్ మరో మెలిమలుపు తిరిగింది. ప్రాంజల్ ఆలోచన పలుపెట్టుబడి దారులకు నచ్చడంతో ఆమెకు చెందిన డెల్వ్.ఏఐ సంస్థలో కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత సంస్థ ప్రాడక్ట్ హంట్ వేదిగా ప్రారంభమవడంతో ప్రాంజల్ వెనక్కు తిరిగిచూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. చాలా చిన్న వయసులోనే అసాధారణ విజయాన్ని అందుకుంది.

Shocking: 13 మంది అమ్మాయిలతో నగ్నంగా డాన్సులు వేయించిన వ్యాపారవేత్త.. అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు..!

యాక్సెలరేటర్ ప్రోగ్రామ్ ప్రోత్సాహంతో డెల్వ్. ఏఐ అనేక సంస్థల నుంచి పెట్టుబడులు రాబట్టగలిగింది. దీంతో, ఏడాది తిరిగే సరికల్లా ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాంజల్ ఏర్పాటు చేసిన సంస్థలో 10 మంది ఉద్యోగులున్నారు.

Updated Date - 2023-10-12T17:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising