ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: దుబాయ్‌లో అగ్నిప్రమాదం.. నలుగురు భారతీయుల దుర్మరణం

ABN, First Publish Date - 2023-04-16T13:55:16+05:30

దుబాయ్‌లో శనివారం సంభవించిన ఓ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: దుబాయ్‌లో శనివారం సంభవించిన ఓ ఘోర అగ్నిప్రమాదంలో(Dubai Fire accident) నలుగురు భారతీయులు మృతి చెందారు(Indians dead). మృతుల్లో కేరళకు చెందిన భార్యాభర్తలు, తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అల్ రాస్ ప్రాంతంలోని ఓ బహుళఅంతస్తుల భవనంలోని నాలుగో అంతస్తులో మధ్యాహ్నం 12.54కి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చూస్తుండగానే ఇతర అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భవంతిలోని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మధ్యాహ్నం సుమారు 3.00 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నారని, వారు ఆ భవంతిలోనే పనిచేసేవారని తెలిపారు. కాగా, భవంతిలో రక్షణ ఏర్పాట్లు సరిగా లేవని స్థానికంగా ఉండే ఓ భారతీయ సామాజిక కార్యకర్త తెలిపారు. మృతుల కుటుంబసభ్యులతో పాటూ ఇండియన్ ఎంబసీ, స్థానికులతో తాను టచ్‌లోనే ఉన్నట్టు తెలిపారు. కాగా.. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చేందుకు దుబాయ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-04-16T13:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising