ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABN, First Publish Date - 2023-03-20T16:33:08+05:30

టెక్సాస్ రాష్ట్రంలోని స్వచ్ఛంధ సంస్థ ఇండియా అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టెక్సాస్‌లోని స్వచ్ఛంధ సంస్థ ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్‌టీ-IANT) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు(International womans day) ఘనంగా జరిగాయి. ప్లానోలోని మినర్వా బాంకెట్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రీతా ప్రభాకర్ ప్రధానోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా పందకొండు మంది మహిళలు..తాము సాధించిన విజయాల గురించి సభికులతో పంచుకున్నారు. ‘నారీ శక్తి’ పేరిట నిర్వహించిన నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. ఇక పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న గీతా మోహన్.. ‘ఐఏఎన్‌టీ వుమన్ ఆఫ్ ది ఇయర్-2023’ అవార్డును అందుకున్నారు. వన్ ఎర్త్ వన్ ఛాన్స్ సంస్థ ద్వారా ఆమె.. 760 మొక్కలు నాటి, వాటికి నీటి వసతి కల్పించారు. పాత దుస్తులను పర్యావరణ హితకరమైన పద్ధతిలో తొలగించడం, వ్యర్థాల నిర్వహణ తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

కాగా.. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన వలంటీర్లు, కార్యక్రమానికి హాజరైన అతిథులు, సభలో పాల్గొన్న ముఖ్యులకు ఐఏఎన్‌టీ అధ్యక్షుడు దినేశ్ హుడా, ప్రెసిడెంట్ ఎలక్ట్ సుష్మ మల్హోత్రా ధన్యవాదాలు తెలిపారు. మహిళల్లో స్ఫూర్తి నింపేలా తమ విజయగాధలు పంచుకున్న వక్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన బోర్డు సభ్యులకు ఐఏఎన్‌టీ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ గౌరవ సభ్యురాలు షబ్నమ్ మోద్గిల్, చైర్మన్ ఇందురెడ్డి మందాడి ధన్యవాదాలు తెలిపారు. ఇక 1962లో ఏర్పాటైన ఐఏఎన్‌టీ ఢీఎఫ్‌డబ్ల్యూ ప్రాంతంలో భారతీయుల కోసం పలు సాంస్కృతిక, విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2023-03-20T16:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising