ATA: ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్
ABN, First Publish Date - 2023-04-11T18:36:28+05:30
ఆటా ఆధ్వర్యంలో మహిళ షార్ట్ క్రికెట్ టోర్నమెంట్
2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్ నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) మొట్టమొదటి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో 9 మహిళా టీమ్‌లు, సుమారు 300 మంది ఉత్సాహభరితమైన ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కోఆర్డినేటర్‌లుగా ఉన్న క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్‌విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం మరియు వాలంటీర్లు నిర్వహించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వం, కీలకపాత్ర పోషించారు.
ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ను, నాష్‌విల్లే రైజర్స్ (విజేత జట్టు), పవర్ గర్ల్స్ (రన్నరప్ జట్టు) మరియు TNMM (రెండవ రన్నరప్ జట్టు ) జట్టులకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి మరియు క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందించారు.
ఆటా నాష్‌విల్ బృందం, ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఇండియా బజార్ మరియు చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.
Updated Date - 2023-04-11T18:36:28+05:30 IST