ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!

ABN, First Publish Date - 2023-10-21T16:55:41+05:30

హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అమెరికా కీలక మార్పులకు సిద్దమైంది. వీసా వ్యవస్థలో పారదర్శకత, లబ్ధిదారులకు న్యాయం చేయడం, తదితర లక్ష్యాలతో బైడెన్ ప్రభుత్వం పలు కీలక మార్పులను ప్రతిపాదించింది.

ఎన్నారై డెస్క్: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను(H-1b Visa Program) మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అమెరికా కీలక మార్పులకు సిద్ధమైంది. వీసా వ్యవస్థలో పారదర్శకత, లబ్ధిదారులకు న్యాయం చేయడం తదితర లక్ష్యాలతో బైడెన్ ప్రభుత్వం పలు మార్పులను ప్రతిపాదించింది(Biden Government proposed Changes). వీసా అర్హత నిబంధనలు, ప్రయోజనాల పెంపు, పలు సడలింపులతో కూడిన సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది.

కొత్త ప్రతిపాదనలు ఇవే..

హెచ్-1బీ వీసా వ్యవస్థ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు బైడెన్ ప్రభుత్వం సింగ్యులర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తు దారుడి తరపున ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న దానితో సంబంధం లేకుండా అతడి వివరాలను ఒకేసారి నమోదు చేసుకుంటారు. దీంతో, బహుళ దరఖాస్తుల ద్వారా వీసా లాటరీని తప్పుదోవ పట్టించే అవకాశం ఉండని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..

అంతేకాకుండా, ఓ లబ్ధిదారుడి తరపున పలు దరఖాస్తులు దాఖలు చేసే అవకాశం లేకుండా సంస్థలను అమెరికా కట్టడి చేయనుంది. ఈ క్రమంలో ఆయా సంస్థల కార్యాలయాలను అమెరికా పౌరసత్వ వలసల శాఖ సిబ్బంది తనిఖీ చేసేందుకు అదనపు అధికారులను కట్టపెట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి దరఖాస్తులు తిరస్కరించడం, జరిమానాలు విధించడం లేదా వారిపై రివోక్ చేయడం వంటివాటికి అవకాశం కల్పించే కఠిన నిబంధనలు సిద్ధం చేశారు.

NRI: రోడ్డు పక్కన విదేశీ మహిళ మృతదేహం.. సీసీటీవీ కెమెరాలు పరిశిలిస్తే వెలుగులోకొచ్చి దారుణం..


అభ్యర్థుల విద్యార్హత, వారు చేయబోయే ఉద్యోగానికి మధ్య సంబంధంపై మరింత స్పష్టత చేకూర్చే విధంగా బైడెన్ ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. తద్వారా, భవిష్యత్తులో అప్లికేషన్ ప్రాసెసింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది.

NRI: అమెరికా వృద్ధురాలికి కంప్యూటర్‌పై అవగాహన ఉండదని తెలిసే పక్కా ప్లాన్.. బ్యాంక్‌లోని డబ్బంతా విత్‌డ్రా చేయించి..

స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలు, ఇతర లబ్ధిదారులకు ఇచ్చే మినహాయింపులు మరింత విస్త్రత పరిచేలా బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎఫ్-1బీ వీసాదారులకు ఇకపై మరింత సులభంగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేలా నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది.

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

ఇక ఓత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా హెచ్-1బీ అర్హతల్లో కొత్త నిబంధనలు జోడించేందుకు హోం ల్యాండ్ సెక్యూరిటీ సిద్ధమవుతోంది. తాజా మార్పులపై ఎన్నారైల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను అమెరికాకు ఆకర్షించేలా నూతన ప్రతిపాదనలు ఉన్నాయని పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-10-21T17:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising