NRI: దుబాయిలో తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు
ABN, First Publish Date - 2023-03-21T18:39:33+05:30
తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయిలో ఘనంగా ఉగాది ఉత్సవాలు..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగల నిర్వహణలో దుబాయిలో ముందుంజలో ఉండే దుబాయి తెలుగు అసోసియేషన్ ప్రతి సంవత్సరం తరహా ఈ సారి కూడా ఉగాది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. మాతృత్వం మరియు జీవితంలో భాగమైన సెల్ ఫోన్ వాడకంతో పాటు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై వినోద్ ఆలపించిన ఘజల్స్ కార్యక్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు సినీ రంగం నుండి సంగీత దర్శకురాలు యం.యం. శ్రీలేఖ, కథా నాయిక కామా జెఠ్మాలనీ, నిర్మాత రాజశేఖర వర్మలతో పాటు న్యాయవాది మాధవరావు పట్నాయక్ హజరయ్యారు.
సినీ సంగీత ప్రస్ధానంలో పాతిక వసంతాలు పూర్తి చేసుకోంటున్న నేపథ్యంలో శ్రీ లేఖ తాను 25 దేశాలలో పర్యటిస్తున్నట్లుగా అందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో పర్యటిస్తున్నాని చెప్పారు.
మిమిక్రీ కళాకారుడు రాజు ప్రదర్శించిన సినీ మరియు రాజకీయ ప్రముఖుల అనుకరణ అందరినీ నవ్వుల్లో ఓలలాడించింది. మిమిక్రీ రాజు 8 నిమిషాల నిడివి వున్న సినీ సన్నివేశాల మాలికని ప్రదర్శిస్తూ, అందులో కనిపించిన దాదపు 50 మంది ప్రముఖ సినీ నటులను అనుకరించటం ఆహూతులందరినీ మంత్రముగ్ధులను చేసింది. మిమిక్రీ రాజు మొట్టమొదటి సారిగా యిటువంటి ప్రయత్నం చేయటం, సఫలీకృతం అవటం ఎంతో తృప్తినిచ్చినట్లు తెలిపారు
తెలుగు అసోసియెషన్ కల్చరల్ డైరెక్టర్ వక్కలగడ్డ వెంకట సురేష్ అన్ని తానై కార్యక్రమాన్ని నిర్వహించగా యాంకర్ రవి, ఉష, శరణ్య సంధానకర్తలుగా వ్యవహరించారు.
తెలుగు అస్సోసిఏషన్ తరపున జనరల్ సెక్రటరీ వివేకానంద్ బలుస సేవ, సంస్కృతి, సమైక్యత అనే మూడు మూల స్థంభాలపై స్థాపించిన తెలుగు అసోసియెషన్ ప్రగతి గూర్చి వివరించారు.
Updated Date - 2023-03-21T18:42:29+05:30 IST