NRI: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో గల్ఫ్ ప్రతినిధుల సమావేశం
ABN, First Publish Date - 2023-05-08T18:05:24+05:30
రానున్న ఎన్నికలలో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించిన ఆంశాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో బీజేపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు పన్నీరు నరేంద్ర సోమవారం చర్చించారు.
తెలంగాణ బీజేపీ ఎజెండాలో గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో ప్రవాసీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారి పునరావాస విషయానికి సంబంధించి హామిలతో గల్ఫ్ ప్రవాసీయులను, వారి కుటుంబాలను ఆకట్టుకోవాలని తెలంగాణ బీజేపీ ప్రయత్నిస్తోంది.
రానున్న ఎన్నికలలో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించిన ఆంశాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో బీజేపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు పన్నీరు నరేంద్ర సోమవారం చర్చించారు. బీజేపీకి బలం ఉన్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగరం నుండి పెద్ద సంఖ్యలో గల్ఫ్‌కు వలసలు ఉన్నందున ఈ దిశగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లుగా సమావేశనంతరం నరేంద్ర వెల్లడించారు.
నరేంద్రతో పాటు ఒమాన్ బీజేపీ కార్యదర్శి అంజి గంగాధర్, జగిత్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి పిల్లి శ్రీనివాస్‌లు కూడా ఉన్నారు.
Updated Date - 2023-05-08T18:07:10+05:30 IST