ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నారా? ఇలా చేస్తే వీసా పక్కా అంటున్న అమెరికా మాజీ దౌత్యవేత్త!

ABN, First Publish Date - 2023-05-09T19:45:28+05:30

హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు తాము చేరబోయే సంస్థ, ఉద్యోగం, ఇతర వివరాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని అమెరికా మాజీ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ఇంటర్వ్యూకు ఎలా సిద్ధమవ్వాలనే విషయమై పలు సూచనలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా ప్రభుత్వం మార్చి నెలాఖరులో తొలి విడత హెచ్-1బీ వీసా(H-1B Visa) లాటరీలను విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 780,884 దరఖాస్తులు రాగా 110,971 దరఖాస్తులు తుదపరి రౌండ్లకు ఎంపికయ్యాయి. ఈ లాటరీలో ఎంపికయిన వారు తదుపరి పిటిషన్లు దాఖలు చేసి ఆపై వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూను చాలా సీరియస్‌గా తీసుకోవాలని అమెరికా మాజీ దౌత్యవేత్త ఒకరు జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులు నెగ్గేందుకు పలు కీలక సూచనలు చేశారు.

‘‘జాబ్ ఇంటర్వ్యూకు(Interview) సిద్ధమవుతున్నట్టు వీసా ఇంటర్వ్యూకు సిద్ధం కావాలి. తొలిసారి ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ముందుగా అమెరికా సీరియళ్లు చూడాలి. అమెరికా సంస్కృతి, అక్కడి వారి యాస, భాష, అమెరికన్లకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక పదాలు, జాతీయాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అంతర్జాతీయంగా అందరికీ అర్థమయ్యే స్థాయిలో అభ్యర్థుల ఇంగ్లీషు భాషా నైపుణ్యం ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

అభ్యర్థిపై కాన్సులార్ అధికారి‌కి ఉండే సందేహలన్నీ తొలగించేందుకు వీసా ఇంటర్వ్యూ సరయిన అవకాశమని ఆయన తెలిపారు. ‘‘తనకు ఉద్యోగం ఇచ్చే సంస్థపై అభ్యర్థులకు పూర్తి స్పష్టత ఉండాలి. ఒకవేళ స్టాఫింగ్ ఏజెన్సీ తరుపున వెళుతుంటే తను పనిచేయబోయే సంస్థకు స్టాఫింగ్ ఏజెన్సీకీ మధ్య ఉన్న ఒప్పందం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్లైయింట్ ఉన్న చోటునే ఉద్యోగం చేయాల్సి వస్తే కాంట్రాక్ట్ టైం లిమిట్, చేయబోయే ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. జాబ్‌ పేరిట ఏదైనా అక్రమాలకు పాల్పడుతున్నారా? అన్న సందేహం కాన్సులార్ అధికారుల్లో ఉంటుంది. కాబట్టి, వారు కీలక వివరాలు తెలుసుకోవాలనుకుంటారు’’ అని ఆ దౌత్యవేత్త చెప్పుకొచ్చారు.

ఇంటర్వ్యూకు బాగా సిద్ధమవ్వాలని, తమ జాబ్‌ ఆఫర్‌కు సంబంధించి ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేలా ఉండాలని సూచించారు. పెద్ద చిన్నా వంటి మర్యాదల విషయం అమెరికన్లకు అంత పట్టింపు ఉండదు కాబట్టి ఇంటర్వ్యూ చేసే అధికారిని సర్ అని పిలవకుండానే సాధ్యమైనంత మర్యాదగా సంబోధించాలని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-05-09T19:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising