ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కారు.. ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఆ దేశంలోని ప్రవాసులకే..!

ABN, First Publish Date - 2023-02-20T21:06:54+05:30

భారత్ సింగపూర్ మధ్య రేపు యూపీఐ సేవలు ప్రారంభం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే.. పేరేదైనాగానీ వీటన్నిటికీ మూలం యూపీఐ(UPI) చెల్లింపుల వ్యవస్థే..! యూపీఐ వచ్చాక చెల్లింపులు ఎంతో సులువైపోయాయి. స్మార్ట్ ఫోన్ సాయంతో ఇప్పుడు క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతున్నాం. అయితే..ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న వారికే పరిమితమైన ఈ వ్యవస్థ ఇకపై ఎన్నారైలకూ అందుబాటులోకి రానుంది. మంగళవారం నుంచి సింగపూర్(Singapore), భారత్‌ల(India) మధ్య యూపీఐ సేవలు(Cross border UPI transactions) ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రధానులూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. సింగపూర్‌ చెల్లంపుల వ్యవస్థ పేనౌ(Paynow), యూపీఐ అనుసంధానంతో అక్కడి ఎన్నారైలు సులువుగా భారత్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయచ్చు.

‘‘సింగపూర్‌లోని భారతీయులు, ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు తక్కువ ఖర్చుతో సులభంగా ఇండియాకు నిధులు బదిలీ చేయచ్చు’’ అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘సింగపూర్ ప్రభుత్వం తన చెల్లింపుల వ్యవస్థను యూపీఐతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసింది. ఇతర దేశాలు కూడా ఈ దిశగా అత్యవసర ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. సమాచార భద్రత, గోప్యతకు యూపీఐ వ్యవస్థ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.’’ అని ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గత వారం జరిగిన జీ20 కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

భారత ఫిన్‌టెక్(Fintech Sector) రంగంలో సృజనాత్మకత వెల్లివిరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఫోన్‌పో విదేశాల్లో చెల్లింపులకు అవకాశం కల్పించింది. ఫోన్ పే యూజర్లు తమ యాప్ ద్వారా యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్‌లోని వ్యాపార సంస్థలకు నేరుగా చెల్లింపులు జరపచ్చు.

Updated Date - 2023-02-20T21:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising