NRI: లండన్‌లో భారత సంతతి సైకియాట్రిస్ట్‌కు ఆరు సంవత్సరాల జైలు శిక్ష
ABN, First Publish Date - 2023-06-25T23:31:34+05:30
చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి డార్క్ వెబ్‌లో ఓ వెబ్‌సైట్ నిర్వహణలో పాలుపంచుకున్న భారత సంతతి వ్యక్తి సైకియాట్రిస్ట్‌కు లండన్‌లో తాజాగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడింది.
ఎన్నారై డెస్క్: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి డార్క్ వెబ్‌లో ఓ వెబ్‌సైట్ నిర్వహణలో పాలుపంచుకున్న భారత సంతతి వ్యక్తి సైకియాట్రిస్ట్‌కు లండన్‌లో తాజాగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడింది. నిందితుడు కబీర్ గార్గ్‌ను లైంగిక నేరగాళ్ల జాబితాలోనూ శాశ్వతంగా నేర్చినట్టు నేషనల్ ఇన్వెస్టిగేష్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో గార్గ్ తాను తప్పు చేసినట్టు కోర్టులో అంగీకరించాడు. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన చిత్రాలు ఇతరలకు బట్వాడా చేసినట్టు ఒప్పుకున్నాడు. గార్గ్ ఓ డార్క్ వెబ్‌సైట్‌కు మోడరేటర్‌గా ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గతేడాది అతడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పోలీసులు అతడి ఇంట్లోకి వెళ్లిన సమయంలో అతడి ల్యాప్‌టాప్‌లో నిషేధిత వెబ్‌సైట్ కనిపించింది. అంతేకాకుండా, అతడు అందులో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ద్వారా లాగిన్ అయి ఉన్నట్టు కూడా గుర్తించారు. గతేడాది నవంబర్‌లో పోలీసులు గార్గ్ లెవిషామ్‌లోని అతడు ఇంట్లోనే అరెస్టు చేశారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించి గార్గ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-06-26T23:22:48+05:30 IST