ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఇద్దరు భారతీయుల సరికొత్త గిన్నిస్ రికార్డ్.. కేవలం 3 రోజుల్లో..

ABN, First Publish Date - 2023-01-10T17:49:45+05:30

మరో గిన్నిస్ రికార్డ్ భారతీయుల సొంతమైంది. డా. అలీ ఇరానీ, సుజయ్ కుమార్ మిత్రా.. భూమ్మీదున్న 7 ఖండాలను 73 గంటల్లోనే చుట్టొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మరో గిన్నిస్ రికార్డ్ భారతీయుల సొంతమైంది. డా. అలీ ఇరానీ, సుజయ్ కుమార్ మిత్రా.. భూమ్మీదున్న 7 ఖండాలను 73 గంటల్లోనే చుట్టొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అతి తక్కువ సమయంలో అన్ని ఖండాల్లో పర్యటించిన వారిని గిన్నిస్ రికార్డ్ వరించింది. అరుదైన రికార్డ్ నెలకొల్పడంపై ఇరువురూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు మేము ఓ రికార్డు బద్దలు కొట్టి ఉండొచ్చు. కానీ.. రేపు ఇంకొకరు మా రికార్డ్‌ను అధిగమిస్తారు’’ అంటూ వారిద్దరూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ రికార్డైనా అధిగమించొచ్చనేది తమ నమ్మకమని వారు చెప్పారు. పర్యటనలంటే ఇష్టపడే అలీ, సుజయ్..కేవలం మూడు రోజుల్లోనే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఓషియానాలను చుట్టొచ్చేశారు. గతేడాది డిసెంబర్ 4న అంటార్కిటికాలో మొదలైన వారి పర్యటన డిసెంబర్ 7న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ నగరంలో ముగిసింది. తమ గిన్నిస్ రికార్డను డా.అలీ ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Updated Date - 2023-01-10T18:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising