Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!
ABN, First Publish Date - 2023-11-26T18:06:00+05:30
భారతీయ ఫుడ్ కారంగా ఉందంటూ రిఫండ్ కోరితే కుదరదంటూ ఓ బ్రిటన్ రెస్టారెంట్ వార్నింగ్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పు, కారం, మసాలాలు దట్టించిన భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. ఎందరో విదేశీయులు మన వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. అయితే, అధికశాతం మంది మాత్రం మన ఫుడ్‌లో ఘాటును తట్టుకోలేరు. అలాగని టేస్ట్ చేయకుండా ఉండనూ లేరు! ఈ పరిస్థితి.. బ్రిటన్‌లోని(UK) రెస్టారెంట్‌కు చిక్కులు తెచ్చి పెట్టింది. దీంతో, విదేశీయులకు గట్టి హెచ్చరిక జారీ చేసూ ఎంట్రన్స్ డోరుకు ఓ నోటీసు అంటించింది. అందులో ఏం రాసుందో చదివి బ్రిటన్ ప్రజలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
Viral: వామ్మో ఇంత దూకుడా.. ఇలాగైతే చైనాను ఆపడం కష్టమే..!
ఘాటుగా ఉన్న ఫుడ్ ఆర్డరిచ్చి, ఆపై మంట భరించలేక రిఫండ్ కావాలంటే కుదరదు. ఇకపై డబ్బులు తిరిగి ఇవ్వము.. అని ఆ రెస్టారెంట్ తెగేసి చెప్పింది(Indian restaurant in UK warns customers who can't handle spice). ఈ మేరకు ఎంట్రన్స్ తలుపు వద్ద ఓ నోటీసు అంటించింది. దీన్ని ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేసిన బ్రిటన్ వ్యక్తి.. రెస్టారెంట్ వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కారం తట్టుకోలేక రిఫండ్‌లు కోరేవారితో విసిగిపోయి ఇలా చేసుంటుందంటూ కామెంట్ చేశాడు.
ఫారినర్లను ఈ ట్వీట్ బాగా ఆకట్టుకోవడంతో చూస్తుండగానే ఇది నెట్టింట వైరల్(Viral) అయిపోయింది. ఈ పాలసీకి అనేక మంది మద్దతు పలికారు. కొందరు మత్రం సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘కారం ఎక్కువైతే రిఫండ్ ఇవ్వనన్నారు సరే.. మరి కారం తక్కువైతే ఇస్తారా?’’ అంటూ ఓ నెటిజన్ కొంటె ప్రశ్న వేశారు. ‘‘వారి నిజాయతీని మెచ్చుకోవాల్సిందే..ఈ నోటీసుతో కస్టమర్ సర్వీసును కూడా ఘాటెక్కించారుగా! చూడబోతే..ఇదేదో సాహసంలా ఉంది! ఇక్కడకు ఒసారి వెళ్లాల్సిందే!’’ అంటూ మరో వ్యక్తి సరదా కామెంట్ చేశాడు. ‘‘ముఖం మీద చెమటలొస్తేనే నా దృష్టిలో కారం పీక్స్‌కు వెళ్లినట్టు లెక్క’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. అయితే, గతంలో ఓ అమెరికా రెస్టారెంట్ కూడా దాదాపుగా ఇలాంటి ఓ నోటీసు పెట్టింది.
Updated Date - 2023-11-26T18:06:48+05:30 IST