NRI: కెనడాలో భారతీయుల పాట్లు.. వైద్య డిగ్రీలు ఉండి కూడా క్యాబ్ డ్రైవర్లుగా ఉద్యోగాలు!
ABN, First Publish Date - 2023-10-09T22:17:01+05:30
భారత్-కెనడా దౌత్య వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే, అక్కడి భారతీయ విద్యార్థులు మాత్రం మరో సమస్యతో సతమతమవుతున్నారు.
ఎన్నారై డెస్క్: భారత్-కెనడా దౌత్య వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే, అక్కడి భారతీయ విద్యార్థులు(Indian students in Canada) మాత్రం మరో సమస్యతో సతమతమవుతున్నారు. అక్కడ ప్రస్తుతం ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటంతో(Lack of Job opportunities) చదువులు పూర్తయ్యాక తమ పరిస్థితులు ఏమవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి, ఎన్నో కష్టనష్ఠాలకోర్చి ఇక్కడకు పంపించారని, ఉపాధి దొరకకపోతే పరిస్థితి క్లిష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్య విద్య వంటి ప్రొఫెషన్‌ల కోర్సులు చదువుకుని కూడా కొందరు సరైన ఉద్యోగావకాశాలు లేక ట్యాక్సీ డ్రైవర్లుగా, షాపుల్లో, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంటి అద్దెల్లో పొదుపు చేసుకునేందుకు చిన్న చిన్న రూంలల్లో ఇరుక్కుని బతుకుతున్నారని తెలిపారు. జీవన వ్యయాలు, ఆరోగ్య ఖర్చులు వంటివి భారంగా మారడంతో ఖర్చులకు సరిపడా ఆదాయం దొరకట్లేదని చెప్పుకొచ్చారు.
Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..
తాజా లెక్కల ప్రకారం 2022లో మొత్తం 226,450 మంది భారతీయ విద్యార్థులు పైచదువుల కోసం కెనడాకు వెళ్లారు. గతేడాది కెనడాలో కాలుపెట్టిన వారిలో భారతీయులే అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి.
Updated Date - 2023-10-09T22:17:04+05:30 IST