ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అమెరికాలో భారత సంతతి ప్రొఫెసర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN, First Publish Date - 2023-08-15T22:30:05+05:30

అమెరికాలోని ప్రముఖ భారత సంతతి ఆర్థికవేత్త రాజ్ చెట్టికి అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రదానం చేసే ప్రఖ్యాత జార్జ్ లెడ్లీ ప్రైజ్ ఆయనను వరించింది.

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ప్రముఖ భారత సంతతి ఆర్థికవేత్త రాజ్ చెట్టికి అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రదానం చేసే ప్రఖ్యాత జార్జ్ లెడ్లీ ప్రైజ్ ఆయనను వరించింది. అమెరికాలో వివిధ వర్గాలకు విజయావకాశాల మధ్య ఉన్న అంతరాలకు సంబంధించి నెలకొన్న అపోహలు, అంతరాలను డాటా సాయంతో తొలగించినందుకు ఆయన ఈ ఘనత సొంతం చేసుకున్నారు. వేగవంతమైన కోవిడ్ టెస్ట్ తయారు చేసిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, బయాలజిస్ట్ మైఖేల్ స్ప్రింగర్‌ను కూడా జార్జి లీడ్లీ ప్రైజ్ వరించింది. హార్వర్డ్ యూనివర్సిటీ క్లినికల్ లేబొరేటరీ రూపకల్పన, ఏర్పాటులో స్ప్రింగర్ కీలక పాత్ర పోషించారు. వివిధ నమూనాల పరీక్షల నిర్వహణలో ఈలాబ్ ఎంతో కీలకం.

కాగా, చెట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. యూనివర్సిటీలోని ఆర్థికవేత్తల బృందం ఆపర్చునిటీ ఇన్‌సైట్స్‌కు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రజల ఆర్థిక ఎదుగుదలపై డా. చెట్టి విప్లవాత్మక అధ్యయనం, తన అధ్యనం తాలూకు సమాచారాన్ని విధానకర్తలతో పంచుకోవడంతో అనేక మంది అమెరికా కల సాకారమయ్యింది’’ అని యూనివర్సిటీ ప్రొవోస్ట్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ ఆలన్ ఎమ్. గార్బర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-16T13:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising