ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో సెనెటర్‌గా ఉషా రెడ్డి ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2023-01-13T21:52:05+05:30

అమెరికా పెద్దల సభ సభ్యురాలిగా(సెనెటర్) భారత అమెరికన్ ఉషా రెడ్డి శుక్రవారం ప్రమాణశ్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా పెద్దల సభ సభ్యురాలిగా(సెనెటర్) భారత అమెరికన్ ఉషా రెడ్డి(Usha Reddi) శుక్రవారం ప్రమాణస్వీ కారం చేశారు. కాన్సస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22(Kansas District 22) నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. ప్రస్తుత సెనెటర్ టామ్ హాక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన స్థానంలో ఉషా రెడ్డి సెనెటర్‌ పదవి చేపట్టారు. 2025 వరకూ ఆమె పదవిలో కొనసాగుతారు. ఈ బాధ్యత దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. డిస్ట్రిక్ట్ 22 నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. 1973లో ఉషా రెడ్డి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 8 ఏళ్లు. దాదాపు 28 ఏళ్లుగా ఆమె మాన్‌హట్టన్‌లో ఉంటున్నారు. సైకాలజీలో డిగ్రీ పట్టా, ఎడ్యూకేషనల్ లీడర్‌షిప్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగిన ఉషా రెడ్డి గతంలో గతంలో మాన్‌హట్టన్ ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. మేయర్‌గా రెండు మార్లు సేవలందించారు. అనేక హోదాల్లో స్థానిక ప్రజలకు సేవ చేశారు.

Updated Date - 2023-01-13T21:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising