ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అమెరికాలో రూ.107 కోట్ల మోసం కేసులో ఓ ఎన్నారై అరెస్ట్.. ఏకంగా 7 వేల మంది బాధితులు..!

ABN, First Publish Date - 2023-09-02T18:09:10+05:30

సాఫ్ట్‌వేర్ సమస్యల పరిష్కారిని టెక్నికల్ సోర్టు ఇస్తామంటూ ఓ ఎన్నారై వేల మంది అమెరికన్లను మోసగించాడు. మొత్తం 107 కోట్ల మేర దండుకున్నాడు. ఇటీవలే పోలీసులు నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేశారు.

ఎన్నారై డెస్క్: ఏకంగా ఏడు వేల మంది బాధితులు.. మొత్తం రూ.107 కోట్లు దోచేసిన ఘనడు..అమెరికాలో ఎన్నారై ప్రధాన పాత్రధారిగా ఉన్న ఓ భారీ స్కామ్ సంక్షిప్త వర్ణన ఇది! టెక్నికల్ సపోర్టు ఇస్తామంటూ అతడు చేసిన మోసానికి వేల మంది బాధితులుగా మిగిలారు. చివరకు నిందితుడి పాపం బద్దలవడంతో అతడు పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

13 మిలియన్ డాలర్ల భారీ స్కామ్‌లో(Tech Fraud) ప్రధాన నిందితుడిగా ఉన్న మనోజ్ యాదవ్ న్యూజెర్సీలో(NRI Arrested in Newjersey) పోలీసులకు చిక్కాడు. చిన్న, మధ్యస్థాయి వ్యాపారులే లక్ష్యంగా అతడు పక్కా స్కెచ్ వేసి కోట్లు కొల్లగొట్టాడు. టెక్నికల్ సపోర్టు(Tech Support) పేరిట అతడీ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ‘‘వైర్ ఫ్రాడ్ చేసినందుకు అతడిపై కేసు పెట్టాము. మనోజ్ యాదవ్ తో పాటూ మరికొందరు నిందితులు బాధితులను తప్పుదారి పట్టిస్తూ మోసానికి పాల్పడ్డారు’’ అని యూఎస్ అటార్నీ ఫిలిప్ ఆర్ సెలింజర్ గురువారం మీడియాకు తెలిపారు.


సెలింజర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు తాము ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌కు అనుబంధంగా ఉన్న టెక్నాలజీ సపోర్టు సిబ్బంది అంటూ బాధితులను బురిడీ కొట్టించారు. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో పొరపాట్లు సరిదిద్దామంటూ చార్జీల భారీ మొత్తాలు వసూలు చేశారు. కొన్ని సార్లు సబ్‌స్క్రిప్షన్‌ల పేరిట కూడా డబ్బులు వసూలు చేశారు. నిందితుల్లో అధిక శాతం మంది ఇండియా నుంచీ ఈ మోసాలకు పాల్పడ్డట్టు తేలింది. ఒకానొక సందర్భంగా ఓ వృద్ధుడి దగ్గర నుంచి ఏకంగా 9 వేల డాలర్లు నొక్కేశారని అటార్నీ వెల్లడించారు. ఫెబ్స్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, పీఎన్ బుక్‌కీపింగ్ సర్వీసెస్, ఫెబ్స్‌ కన్సల్టింగ్, క్విక్ బుక్స్ టెక్ అసిస్ట్, క్విక్ బుక్ యూఎస్ వంటి నకిలీ సంస్థల పేరిట ఈ మోసాలకు పాల్పడ్డారు.

వినియోగదారులు కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌తో పాటు ఉచితంగా అందించాల్సిన పలు సేవలకు నిందితులు భారీ మొత్తాలు వసూలు చేశారని అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పేర్కొంది. నిందితులకు గొప్ప టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నాయని, అమాయకుల నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో వాళ్లకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న మనోజ్ యాదవ్ బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తంలో 17 శాతం తను అట్టేపెట్టుకుని మిగిలినది సహనిందితులకు ఇచ్చేవాడని యూఎస్ అటార్నీ పేర్కొన్నారు. బాధితులను బురిడీ కొట్టించేందుకు అతడు పలు కంపెనీలు ఏర్పాటు చేసినట్టు కూడా వెల్లడించారు.

Updated Date - 2023-09-02T18:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising