ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: న్యూజెర్సీలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2023-07-13T20:18:27+05:30

అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్టీ రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టి.డి జనార్దన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహన కృష్ణ, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, ఏపీఎన్నార్టీ (APNRT) మాజీ చైర్మన్ వేమూరి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున్న ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావును స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలందరు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు మహానటుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు, చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. నందమూరి తారక రామారావు ఆత్మగౌరవం నినాదంతో తెలుగు వారి అభివృద్ధికి, అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ, అన్ని రంగాల్లో విఫలం అవ్వటం వలన ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందో అందరం చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వార్ధపూరిత రాజకీయ కుట్రల వలన వ్యవస్థలు ఏ రకంగా గాడి తప్పుతున్నాయో చూస్తున్నామని అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఎన్నారైలందరు నడుంబిగించాలని, ఎన్నారైలందరు శ్రమించాలని పిలుపునిచ్చారు.

మన్నవ మోహన కృష్ణ సారథ్యంలో జరిగిన ఈ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వెనిగళ్ల మోహన్ కుమార్, నల్లమల్ల రాధాకృష్ణ, వెనిగళ్ల వంశీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-13T20:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising