ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

USA: ఎల్-1 వీసాలకు వాళ్లు అర్హులు కాదు.. క్లారిటీ ఇచ్చిన అమెరికా

ABN, First Publish Date - 2023-10-22T22:11:44+05:30

సింగిల్ మెంబర్ కంపెనీల యజమానులు ఎల్-1 వర్క ఫారిన్ వర్కర్ వీసాకు అర్హులు కారని అమెరికా తాజాగా స్పష్టం చేసింది.

ఎన్నారై డెస్క్: సింగిల్ మెంబర్ కంపెనీల యజమానులు ఎల్-1 ఫారిన్ వర్కర్ వీసాకు అర్హులు కారని అమెరికా తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు విధానపరమైన మార్పును పేర్కొంది. సోల్ ప్రొప్రైటర్ షిప్ ఉన్న కంపెనీ.. సంస్థ యజమాని తరఫున దరఖాస్తు చేయకూడదని పేర్కొంది. ఇలాంటి కంపెనీల్లో యజమానులకు వారి సంస్థలకు మధ్య చట్టపరంగా వేర్వేరు అస్తిత్వాలు లేనందున వీసా దరఖాస్తుకు అర్హత లేదని వివరణ ఇచ్చింది. అయితే, ఒకే యజమాని ఉన్న కార్పొరేషన్ లేదా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ మాత్రం ఈ వీసాకు యజమాని తరఫున దరఖాస్తు చేయచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం పాలసీ అప్‌డేట్ విడుదల చేసింది.

H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!

వీసా జారీ మరింత సులభతం చేసేందుకు ఈ క్లారిటీ ఇచ్చామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో, కంపెనీలు మరింత సులభంగా తమ ఉద్యోగులను అమెరికాలోని కార్యాలయాలకు తరలించే అవకాశం చిక్కుతుంది. సోల్ ప్రొప్రైటర్‌షిప్ కంపెనీలకు అంతకుమునుపే ఎల్-1 వీసా అర్హత లేకున్నా కూడా తాజాగా ప్రకటనతో ఈ విషయమై మరింత స్పష్టత ఇచ్చామని అమెరికా పేర్కొంది.

Updated Date - 2023-10-22T22:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising