NRI: విమానంలో ఉల్లిపాయలు తెచ్చుకున్న ఎయిర్‌హోస్టస్‌పై స్మగ్లింగ్ కేసు
ABN, First Publish Date - 2023-01-14T19:38:11+05:30
అవి బంగారం కాదు, మాదక ద్రవ్యాలు అంతకన్నా కాదు.. కేవలం ఉల్లిపాయలు. కానీ..వాటిని విమానంలో తరలించిన ఫిలిప్పైన్స్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టస్‌పై ఇటీవల స్మగ్లింగ్ కేసు నమోదైంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అవి బంగారం కాదు, మాదక ద్రవ్యాలు అంతకన్నా కాదు.. కేవలం ఉల్లిపాయలు(Onions). కానీ..వాటిని విమానంలో తరలించిన ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్(Philippines Airlines) ఎయిర్‌హోస్టస్‌పై ఇటీవల స్మగ్లింగ్ కేసు(Smuggling) నమోదైంది. స్వదేశంలో ఉల్లిపాయల ధరలు అధికంగా ఉండటంతో గల్ఫ్‌లో(Gulf) చౌకగా లభిస్తున్న ఉల్లిపాయలను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి ఆమె భంగపడ్డారు. గల్ఫ్‌లోని రియాధ్, దుబాయి నగరాల నుండి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు ఉల్లిపాయలు, నిమ్మకాయలతో పాటు కొన్ని పళ్ళు తీసుకొచ్చినందుకు కస్టమ్స్ అధికారులు ఫిలిప్పీన్స్ ఏయిర్ లైన్సు ఏయిర్ హోస్టస్, ఇతర సిబ్బందిపై కేసు పెట్టారు.
మాంసం, చికెన్ ధరల కంటే ఎక్కువగా ఉల్లి ధరలు ఉండడంతో గల్ఫ్ దేశాలలో చౌకగా లభించే భారత, యమన్ దేశాల ఉల్లిపాయలను ఫిలిప్పీన్స్ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తీసుకెళ్తున్నారు. భారీ జీతాలు అందుకునే విమానాల సిబ్బంది కూడా ఇందుకు మినహాయింపు కాదు. దుబాయిలో రెండున్నర దిర్హాంలకు లభించే ఉల్లిపాయలకు ఫిలిప్పీన్స్‌లో 40 దిర్హాంలు చెల్లించాలి. వరదల కారణంగా ఉల్లి పంట ధ్వంసం కావడంతో అక్కడ ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో యావత్ దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ఫిలిప్పీన్స్ ప్రవాసీయులు స్వదేశానికి వెళ్లేటప్పుడు విలువైన బహుమతులకు బదులుగా ఉల్లిపాయలను వెంట తీసుకెళ్తున్నారు. అయితే.. కస్టమ్స్ అధికారులు మాత్రం ఉల్లిగడ్డల స్మగ్లింగ్‌ను అరికట్టడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
Updated Date - 2023-01-15T07:21:45+05:30 IST