NRI: స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
ABN, First Publish Date - 2023-04-03T17:59:09+05:30
స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యూరిచ్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యూరిచ్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 25న జరిగిన ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది పాల్గొని విజయవంతం చేశారు. భారతీయ సంప్రదాయాలను కాపాడేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల ఆటపాటలతో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.
స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు గనికాంబ కడలి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గారావు కరంకి, కోశాధికారి మాధురి ముళ్లపూడి, సాంస్కృతిక కార్యదర్శి మాణిక్యవల్లి చాగంటి, క్రీడా కార్యదర్శి రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సాంస్కృతిక కార్యక్రమంలో చిదంబరేశ్వర పాఠశాలకు చెందిన 23 మంది చిన్నారులు ప్రదర్శించిన భరత నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉగాది వేడుకలో సాయికృష్ణ, ప్రవీణ్ గౌతమ్, రాయ్, గీతా విజయ్ వంటి గాయకులు చాలా ఉల్లాసంగా తెలుగు పాటలు (కరోకే) పాడారు. ఉగాది పంచాంగ శ్రవణంతో ప్రారంభమైన కార్యక్రమం డీజేతో ముగిసింది.
Updated Date - 2023-04-03T18:00:04+05:30 IST