ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: న్యూజెర్సీలో తానా స్పోర్ట్స్ మీట్

ABN, First Publish Date - 2023-07-03T22:02:32+05:30

ఈనెల 7 నుంచి న్యూజెర్సీలో జరగనున్న తానా (TANA) మహాసభల సందర్భంగా తానా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెద్దఎత్తున పాల్గొన్న క్రీడాకారులు

  • ఈనెల 7 నుంచి 9 వరకు తానా మహాసభలు

హైదరాబాద్ జులై, 3(ఆంధ్రజ్యోతి): ఈనెల 7 నుంచి న్యూజెర్సీలో జరగనున్న తానా (TANA) మహాసభల సందర్భంగా తానా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. తానా స్పోర్ట్స్ చైర్ శ్రీరామ్ ఆలోకం అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్ పొత్తూరు మాట్లాడుతూ.. అమెరికాలోని అన్ని రాష్ట్రాలతోపాటు కెనడా నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. యుఎస్‌లోని పాఠశాలలు, కళాశాలల్లో, క్రీడలకు విద్యావేత్తలతో సమానంగా విలువ ఇస్తారన్నారు. విద్యలో భాగంగా క్రీడలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జులై 7 నుంచి 9 వరకు జరగనున్న తానా మహాసభలో భాగంగా ఈ క్రీడలన్నీ నిర్వహించినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ క్రీడలు యువత, పిల్లల మానసిక వికాసానికి దోహదపడతాయని, యువ తరానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంతోపాటు క్రీడలను ప్రోత్సహించడం దీని లక్ష్యమన్నారు.

పోటీల్లో క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, త్రో బాల్, టెన్నిస్, చెస్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిర్వహించారు. స్పోర్ట్స్ మీట్స్ భవిష్యతులో చాలా జరగాలని స్పోర్ట్స్ మీట్ స్పాన్సర్ చేసిన వంశీ కోట, తానా కాన్ఫరెన్స్ ఓవర్సీస్ డైరెక్టర్ క్రాంతి ఆలపాటి తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ వాలీబాల్ క్రీడాకారుడు రామకృష్ణంరాజు ముదునూరుని తానా సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ క్రీడలు విజయవంతం కావడానికి దేవినేని లక్ష్మి, రాజా కాసుకుర్తి, వంశీ వాసిరెడ్డి, రామకృష్ణ వాసిరెడ్డి, శశాంక్ యార్లగడ్డ, శ్రీనాథ్ సహకారం అందించారు. ఈ కార్యక్రమాలకు స్వచ్ఛంద సేవలు అందించిన చంద్రశేఖర్ కొండపల్లి, పవన్ తాత, నాయుడు ఎర్లే, సందీన్ రెడ్డి కొట్టం, ప్రసాద్ దాసరి, హరిబాబు గంగవరపు, విజయ్ ముసునూరి, చిరంజీవి బోడెంపూడి, వంశీ పొట్లూరిలను శ్రీరామ్ ఆలోకం ప్రశంసించారు. కో-చైర్మన్‌లుగా హరీష్ కూటట్ల, చలం పాపులారి.. కోర్డినేటర్లుగా కృష్ణమోహన్ అమిరినేని, సిద్ధార్థ్, హరిణి పొట్లూరి, దొరబాబు ఆకుల, వెంకట్ చిమ్మిలి, శ్రీని పెద్ది, కృష్ణ యామిని ఈ పోటీలు నిర్వహించారు.

Updated Date - 2023-07-03T22:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising