ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

ABN, First Publish Date - 2023-02-19T21:39:52+05:30

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (Telangana Cultural society-Singapore) ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సింగపూర్‌లో ఉన్న ప్రముఖ శివాలయాలను సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుండి బస్సులు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా మొత్తం 4 బస్సుల ద్వారా సుమారు 200 మంది భక్తులు 11 దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. ఈ శివరాత్రి సందర్భంగా సింగపూర్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రవీణ్ మామిడాల, ముద్దం విజ్జేందర్, కిషన్ రావు, పందిరి విశ్వ ప్రసాద్, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, ప్రాంతీయ కార్యదర్శులు నడికట్ల భాస్కర్, బొందుగుల రాము వ్యవహరించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ ఈ యాత్రను ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-02-20T21:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising