ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: థాయ్‌లాండ్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2023-10-31T17:38:47+05:30

థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గుడ్ న్యూస్. భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

ఎన్నారై డెస్క్: థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గుడ్ న్యూస్. భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి 2024 మే వరకూ ఈ వీసా రహిత పర్యటన సౌకర్యం భారతీయులకు అందుబాటులో ఉంటుంది. థాయ్‌లాండ్‌లో పర్యాటక సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లోనే చైనా జాతీయులకు థాయ్‌లాండ్ ఈ సౌకర్యం కల్పించింది. థాయ్‌లాండ్‌కు వచ్చే విదేశీ పర్యటకుల్లో చైనీయుల వాటా అత్యధికం. కరోనా సంక్షోభానికి పూర్వం 2019లో థాయ్‌లాండ్‌కు రికార్డు స్థాయిలో 39 మంది విదేశీ పర్యాటకుల సందర్శించగా వారిలో చైనీయులు ఏకంగా 11 మంది మిలియన్లు ఉన్నారు.


తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ 22 మంది విదేశీ పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించగా ప్రభుత్వ ఖజానాలో 25.67 మిలియన్ డాలర్ల ఆదాయం చేరింది.

భారతీయులతో పాటూ తైవాన్ వారికీ థాయ్‌లాండ్ ప్రభుత్వం వీసా రహిత సందర్శనకు అనుమతించింది. థాయ్‌లాండ్‌కు వచ్చే విదేశీయుల్లో భారతీయులు సంఖ్యాపరంగా నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 1.2 మిలియన్ మంది భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఇక పర్యాటకాన్ని కరోనా సంక్షోభం పూర్వపు స్థితికి చేర్చాలనే పట్టుదలతో ఉన్న థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 28 మిలియన్ విదేశీ టూరిస్టులు ఆకర్షించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2023-10-31T17:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising