ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visa: విద్యార్థి వీసా నిబంధనల్లో మార్పులు.. భారత విద్యార్థులకు బ్రిటన్ మంత్రి అభయహస్తం!

ABN, First Publish Date - 2023-05-29T18:55:56+05:30

బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధనల్లో ఇటీవలి మార్పులు భారత విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి తారీఖ్ అహ్మద్ అభయహస్తం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధనల్లో(UK Visa Rule Changes) ఇటీవలి మార్పులు భారత విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి తారీఖ్ అహ్మద్ అభయహస్తం ఇచ్చారు. తాజాగా మార్పులతో భారతీయ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇచ్చారు. ఏడాది కాల వ్యవధి కలిగిన రీసెర్చ్, డాక్టోరల్ కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలు తెచ్చామన్నారు.

‘‘అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు బ్రిటన్‌లో సాదరస్వాగతం లభిస్తుంది. ఏడాది కోర్సుల్లో చేరే రీసెర్చ్, పీహెచ్‌డీ విద్యార్థులే లక్ష్యంగా మేము నిబంధనలను మార్చాం. చట్టబద్ధ వలసలతో బ్రిటన్‌కే లాభం. చట్టవ్యతిరేకంగా బ్రిటన్‌ కొచ్చేవారిని అడ్డుకోవడమే మా లక్ష్యం. విద్యార్థుల్లో అధిక శాతం ఇండియా నుంచి వచ్చిన వారే. భారత్‌‌ నుంచి మరింత మంది రావాలని ఆశిస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తారీఖ్ అహ్మద్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్నారు. ఖలిస్థానీ వేర్పాటువాదుల చర్యలు భారత్-బ్రిటన్ బంధంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో భారత్‌లో బ్రిటన మంత్రి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

సోమవారం బ్రిటన్ మంత్రి తారీఖ్ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఇతర సీనియర్ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్, బ్రిటన్‌ల మధ్య బంధం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌నూ ఆయన సందర్శించనున్నారు. ఇక్కడి స్టార్టప్ సంస్థల్లో కొత్త ఆవిష్కరణలపై మంత్రి దృష్టిసారిస్తారు.

ప్రస్తుతం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌కు ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తారీఖ్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. ‘‘ఇదో అద్భుతమైన భావన. మాటల్లో చెప్పడం కష్టం. మహారాజా ఉమైద్ సింగ్ సంస్థానంలో మా తాతగారు కోశాధికారిగా ఉండేవారు. ఆయన తండ్రి ఓ వైద్యుడు. ఆయనకు రాజప్రాసాదంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి’’ అని బ్రిటన్ మంత్రి చెప్పుకొచ్చారు. బ్రిటన్ మంత్రి తండ్రి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. బ్రిటన్‌‌లో కాలుపెట్టే సమయానికి ఆయన జేబులో కేవలం ఐదు పౌండ్లు మాత్రమే ఉన్నాయి. అవసరాలు తీర్చుకునేందుకు మొదట్లో ఆయన రైల్వేలో చిన్న కార్మికుడిగా పనిచేశారు. అయితే, నిరంతర అధ్యయనంతో ఆయన తన కుటుంబంతో సహా అభివృద్ధి పథంలో ప్రయాణించారు.

Updated Date - 2023-05-29T18:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising