ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: విశ్వవేద పారాయణ బృందం ఆధ్వర్యంలో లక్ష్మీ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ

ABN, First Publish Date - 2023-10-09T20:37:16+05:30

సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న విశ్వ వేద పారాయణ బృందం(వీవీపీబీ) ఆధ్వర్యంలో టెక్సాస్‌లో టెక్సాస్‌లో 5వ వార్షిక విష్ణు సహస్రనామ పారాయణ, సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఎన్నారై డెస్క్: సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న విశ్వ వేద పారాయణ బృందం(వీవీపీబీ) ఆధ్వర్యంలో టెక్సాస్‌లో 5వ వార్షిక విష్ణు సహస్రనామ పారాయణ, సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. హ్యూస్టన్‌లోని టాంప్కిన్స్ హైస్కూల్‌ వేదికగా సెప్టెంబర్ 23న జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విష్ణుసహస్రనామ పారాయణ చేశారు. వివిధ సంస్థలకు చెందిన వేద విద్యార్థులతో తమ అనుభూతిని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 700 మంది హాజరయ్యారు.


తొలుత విష్ణుసహస్రనామ పారాయణ, ఆపై సామూహిక లక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం, భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు మాట్లాడుతూ..సనాతన ధర్మ పరిరక్షణ, విజ్ఞాన ప్రచారానికి వీవీపీబీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నటు తెలిపారు.

కాగా, వీవీపీబీ అనేక ఇతర సేవాకార్యక్రమాలు చేపడుతోంది. వైదిక విజ్ఞానం భావితరాలకు అందించేందుకు వీలుగా వైదిక సంస్థలు, విద్యార్థులకు అండగా నిలుస్తోంది. అంతేకాకుండా, వేదపండితులు,పెద్దలు, ఇతరులకు అవసరమైన వైద్య సహాయం అందించేలా పలు చర్యలు తీసుకుంటోంది. వీవీపీబీని 2019లో రఘు శర్మ చుండూరు మరికొందరు వలంటీర్లతో కలిసి స్థాపించారు. ఈ నాలుగేళ్లలో వైదిక సంస్కృతి, సనాతన ధర్మ ప్రచారం కోసం వీవీపీబీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా విష్ణుసహస్రనామ పఠన కార్యక్రమం నిర్వహిస్తోంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే వారిని ఏకతాటిపైకి చేర్చి, వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ కార్యక్రమాలు ఎంతో తోడ్పడుతున్నాయి.

Updated Date - 2023-10-09T20:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising