ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Benefits of chickpeas: వేయించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ABN, First Publish Date - 2023-12-13T08:33:18+05:30

బస్‌స్టాండ్‌లలో.. రైల్వే స్టేషన్లలో... పార్క్‌లలో- ఇలా ఎక్కడికి వెళ్లినా వేగించిన శనగలు దొరుకుతూ ఉంటాయి. అయితే చాలా మంది వీటిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఈ వేగించిన శనగలలో అనేక పోషకవిలువలు ఉన్నాయని.. చిప్స్‌ కన్నా ఇవి వెయ్యిరెట్లు మేలని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు....

1/5

ఉదయాన్నే ఒక గుప్పెడు వెయించిన శనగలు తింటే, అది మీ బరువును అదుపులో ఉంచుతుంది. మీరు ఊబకాయం బారినపడకుండా ఉంటారు. అల్పాహారం కోసం కూడా వీటిని తినొచ్చు.

2/5

వేగించిన శనగలలో స్టెరోల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ చేరకుండా అడ్డుపడుతుంది.

3/5

నల్లశనగలలో విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్‌తో పాటుగా ఫైబర్‌ కూడా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే- మన శరీరానికి అవసరమైన పౌష్టికాహారం లభిస్తుంది.

4/5

వీటిలో యాంటీఆక్సిడెంట్స్‌ మరియు ఫైటోన్యూట్రియంట్స్‌ ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అంతే కాకుండా గుండెలో రక్తం గడ్డకట్టకుండా ఉపకరిస్తాయి.

5/5

చాలా మంది వేగించిన శనగలు త్వరగా జీర్ణమవ్వవని అనుకుంటారు. కానీ వేగించిన శనగలలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల త్వరగా అరుగుతుంది. అంతే కాకుండా వీటిని తింటే త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకొనేవారికి వేగించిన శనగలు మంచి ఆహారం.

Updated Date - 2023-12-13T08:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising