ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP : వైసీపీ ఎమ్మెల్యేకు వెరైటీ స్వాగతం.. అవాక్కయిన అధిష్టానం.. ఈ కామెంట్స్ విన్నాక మీరేమంటారో..!

ABN, First Publish Date - 2023-05-24T22:48:29+05:30

అవును.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు (YSRCP MLA) వెరైటీగా జనాలు స్వాగతం పలికారు. అది కూడా అలాంటి ఇలాంటి వెరైటీ కాదండోయ్.. ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు (YSRCP MLA) వెరైటీగా జనాలు స్వాగతం పలికారు. అది కూడా అలాంటి ఇలాంటి వెరైటీ కాదండోయ్.. ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎక్కడా జరగలేదండోయ్.. ఈ రేంజ్‌లో ఘన స్వాగతం పలకడాన్ని బహుశా ఆ ఎమ్మెల్యే తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేరేమో..! దీంతో ఆ ఎమ్మెల్యేకి తిక్కలేసి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.. మీడియా ముందుకొచ్చి నోటీకొచ్చినట్లుగా మాట్లాడేశారు. బాబోయ్ ఆ మాటలు గానీ విన్నారో.. ఇంతకీ ఈయన ఎమ్మెల్యేనా లేకుంటే ఇంకేమైనానా అన్నట్లుగా సందేహాలు మీకొస్తాయ్..! అటు స్వాగతం.. ఇటు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఈ మొత్తం వ్యవహారం అధిష్టానం దాకా వెళ్లడంతో అవాక్కయ్యిందట. ఇంతకీ ఏమిటా వెరైటీ స్వాగతం..? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడారనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో చూద్దాం..

ఇదీ అసలు కథ..

వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ (Gadapa Gadapaku Mana Prabhutvam) కార్యక్రమంలో అడుగడుగునా ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురైనట్లు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు (puthalapattu) నియోజకవర్గంలో ఇందుకు చాలా భిన్నంగా జరిగింది. నిరసన, ధర్నాలు, రాస్తారోకోలు, నిలదీయడాలు ఇవన్నీ పాతవైపోయాయ్ అనుకున్నారేమో కానీ.. ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వస్తున్నారని ఊరు ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. పేట అగ్రహారం పంచాయతీలోని అంబేద్కర్ కాలనీలో ఈ చేదు అనుభవం ఎమ్మెల్యేకు ఎదురైంది. సమస్యలు చెప్పినా ఫలితం లేదని చెప్పలేదో.. లేకుంటే ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యమని వెళ్లిపోయారో తెలియట్లేదు కానీ ఈ రేంజ్‌లో ఆహ్వానం మునుపెన్నడూ చూడలేదు. ఒక్కరంటే ఒక్క ఇంటి వాళ్లు కూడా కనిపించకపోవడంతో సార్‌కు చిర్రెత్తిపోయింది.

ఈయన ఎమ్మెల్యేనానా..!?

మీడియా ముందుకొచ్చిన ఎమ్మెస్ బాబు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఏంటి ఎమ్మెల్యే వస్తేనే ఒక్కరూ ఉండరా..? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొంది ఇలా బహిష్కరిచడమేంటి..? అని ఒంటికాలిపై లేచారు ఎమ్మెల్యే. అంతటితో ఆగలేదు.. ఇళ్లకు తాళం వేసిన వారు ఎలా లబ్ది పొందుతారు..? అని ప్రజలనే ప్రశ్నించారు. ప్రభుత్వం డబ్బులిస్తే తీసుకుంటారు కానీ.. ఎమ్మెల్యే ఇంటి దగ్గరికొస్తే తాళాలేస్తారా..? అని అక్కసు వెళ్లగక్కారు. తనను ఇంతగా అవమానించిన వారికి వందకు వంద శాతం పథకాలు రావు.. రానివ్వని శపథాలు చేశారు. ఇప్పటి వరకూ ఇచ్చిన పథకాలను రివర్స్ ఇచ్చేయాలని కూడా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి.. అసలు వాళ్లు ఎందుకు బాయ్‌కాట్ చేశారో.. సమస్యేంటో అడిగి తెలుసుకుని పరిష్కరించాల్సింది పోయి.. ఇలా మాట్లాడమేంటో.. అని ఈ కామెంట్స్ చూసిన జనాలంతా పీకల్లోతు కోపంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే అయ్యుండి.. ప్రజలపై ఇంత బలుపుగా మాట్లాడటమేంటి..? అయినా ప్రభుత్వం పథకాలు ఇస్తుంటే.. ఎమ్మెల్యే ఇలా విర్రవీగి మాట్లాడమేంటి..? అని జనాలు మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సొంత పార్టీ కార్యకర్తలు కామెంట్స్‌తో దుమ్ముదులిపేస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారం అధిష్టానం దాకా వెళ్లడంతో నవ్వాలో.. ఏడవాలో.. బాధపడాలో తెలియని పరిస్థితట.

జగన్‌కే తప్పని తిప్పలు..!

వాస్తవానికి ఈ ఒక్క ఎమ్మెల్యే వ్యవహారమే కాదు.. ఇప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని ప్రతిరోజూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆఖరికి సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలు, బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అటు జగన్ ప్రసంగం ప్రారంభించారో లేదో.. ఇటు సభకు వచ్చిన జనాలు వెళ్లిపోతున్నారు.. ఆఖరికి ఖాళీ కుర్చీలకు కబుర్లు చెబుతున్న పరిస్థితి ఉందని విమర్శలు రోజూ వస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ చూశారుగా.. ఈ కామెంట్స్ చదివాక ఈయన్ను ఎమ్మెల్యే అని అంటారో.. అసలు ఆ పదం పలకడానికి సాహసం చేస్తారో లేదో మీ ఇష్టమిక..! ఇంత జరిగిన తర్వాత వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఫుల్ క్లారిటీ.. రేవంత్ రెడ్డిపై ఈటలకు ఇంత ప్రేమేంటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!?

******************************

TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!

******************************

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

******************************

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

******************************

YS Avinash Vs CBI : నిన్న రెచ్చిపోయారు.. ఇవాళ సెంటిమెట్‌తో కొడుతున్నారు..రేపేంటో.. బాబోయ్ మాములు కథ కాదే..!

******************************

Updated Date - 2023-05-24T22:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising