ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics : బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. రాజీనామా సిద్ధమైన కీలక నేత.. అదే బాటలో మరికొందరు!

ABN, First Publish Date - 2023-07-23T15:57:20+05:30

తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తు్న్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు, మాజీలు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు (BRS MLC) సైతం రాజీనామాకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది...

తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తు్న్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు, మాజీలు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు (BRS MLC) సైతం రాజీనామాకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు.. సిట్టింగుల్లో 25 మంది సిట్టింగ్‌లకు ఈసారి ఎట్టిపరిస్థితుల్లో టికెట్ ఛాన్స్ లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) చేయించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెలుగు చూడటంతో 25 మంది కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వబోతున్నారని తెలియవచ్చింది. అయితే అవన్నీ అటుంచితే.. హ్యాట్రిక్ కొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్‌కు వరుసగా ఊహించని రీతిలో ఝలక్‌లు వస్తున్నాయ్. మరోవైపు.. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా నిరసన సెగలు మాత్రం తప్పట్లేదు. ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ద్వితియ శ్రేణి నేతలు, నియోజకవర్గంలోని కీలక నేతలే తిరుగుబాటు చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి..!


ఇదీ అసలు సంగతి..

ముథోల్​బీఆర్ఎస్ (Mudhole BRS) పార్టీలో అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు రోజురోజుకు ఎక్కవవతున్నాయి. ఎమ్మెల్యే విఠల్​రెడ్డిపై (MLA Vittal Reddy) ఆ పార్టీ సీనియర్​ నేతలు, నియోజకవర్గంలోని కీలక నేతలు అసమ్మతి రాగం వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సీనియర్ నేత నర్సాగౌడ్ (Narsa Gowd) తన అనుచరగణంతో ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో (TPCC Chief Revanth Reddy) భేటీ కావడంతో నియోజకవర్గంలో పెద్ద చర్చకే దారితీసింది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే అసమ్మతి వర్గం హైదరాబాద్‌లో (Hyderabad) మకాం వేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధిష్టానానికే ఫిర్యాదు చేసిందంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్​, బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్​ పటేల్, మాజీ ఎంపీపీ సాయిబాబా, ముథోల్​, బాసర మండలాల కీలక నాయకులు, భైంసా మాజీ జడ్పీటీసీ నీలాబాయి రాంకిషన్, తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ పండిత్ రావు పటేల్, సీనియర్​ లీడర్​ మధుకర్, విఠల్ భైంసా జడ్పీటీసీ దీపా తండ్రి సోలాంకీ భీంరావు, బాసర జడ్పీటీసీ వసంత భర్త సౌంవ్లీ రమేష్‌లు చాలా రోజులుగా ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వీరిలో చాలా మందే ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు కూడా.

రాజీనామా బాటలో!

విఠల్ రెడ్డితో పడక విసిగిపోయిన కొందరు నేతలు రాజీనామా బాట పట్టారు. వీరిలో నియోజకవర్గ కీలక నేత, మాజీ జడ్పీటీసీ నర్సాగౌడ్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అందుకే పార్టీని వీడుతున్నట్లు నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో విఠల్ రెడ్డి గెలుపులో నర్సాగౌడ్ కీలకపాత్ర పోషించారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. అంత కీలకంగా వ్యవహరించిన నర్సాగౌడ్‌నే పట్టించుకోకపోవడంతో క్యాడర్ అసహనానికి లోనైంది. దీంతో అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన నర్సాగౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ అసమ్మతి, తిరుగుబావుటా చేస్తున్న నేతలకు పరోక్షంగా వేణు అండదండలు అందిస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి.. విఠల్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా నిరసన సెగలు ఎక్కువయ్యాయి. ఓ వైపు ముథోల్ ప్రజలు, మరోవైపు నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి చర్యల్లేవు. ఇప్పుడు ఏకంగా రాజీనామా బాట పడుతుండటంతో ఇకనైనా అధిష్టానం మేల్కొని తగు చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. అయితే.. కేసీఆర్ టికెట్ ఇవ్వకూడదనుకుంటున్న ఆ 25 మందిలో విఠల్ రెడ్డి కూడా ఉన్నారని అందుకే అధిష్టానం పెద్దగా పట్టించుకోవట్లేదని.. ఆగస్టులో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి


AP Politics : ఏపీ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్.. వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్..!


Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?


Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..


Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?


Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!


TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!


Updated Date - 2023-07-23T16:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising