కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ

ABN, First Publish Date - 2023-07-29T16:31:15+05:30

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది..

Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఉద్దేశించి కొన్ని డైలాగ్స్, మంత్రి అంబటి రాంబాబు (Minister Rambabu) సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఈ మూవీ టీమ్‌పై వైసీపీ శ్రేణులు (YSR Congress) మండిపడుతున్నాయి. ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంటర్నెట్ఉంది కదా ఇష్టానుసారం ట్వీట్లు చేయడం.. దానికి వైసీపీ కార్యకర్తలు కొందరు నోటికొచ్చినట్లు కామెంట్స్ చేయడం గత 48 గంటలుగా ఇదే పనిగా పెట్టుకున్నారు. సినిమాను సినిమాగా చూడాల్సిన వైసీపీ శ్రేణులు ఇలా విమర్శలతో వార్తల్లోకి ఎక్కారు. పోనీ కార్యకర్తలకు కోపతాపాలు మామూలే అనుకుంటే.. అదేదో సామెత ఉంది కదా.. గుమ్మడి దొంగ అంటే.. అన్నట్లుగా ఈ వ్యవహారంపై స్పందించడానికి మంత్రి అంబటి రాంబాబు (Rambabu) ఓ వైపు ట్విట్టర్‌లో.. మరోవైపు మీడియా మీట్‌లో మాట్లాడరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీడియా ముందుకొచ్చిన మంత్రి.. పవన్, తనను ఇమిటేట్ చేస్తూ నటించిన నటుడు పృథ్వీ రాజ్ (Prudhvi raj) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు పృథ్వీ స్పందిస్తూ.. మంత్రికి దిమ్మదిరిగేలా కౌంటరిచ్చారు.


BRO-Movie.jpg

సినిమాలో ఏముంది..!?

‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్రలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ (Thirty Years Industry) పృథ్వీరాజ్ నటించారు. పబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఒకట్రెండు సీన్‌లు ఉంటాయి. అయితే పృథ్వీ డ్యాన్స్, డ్రస్ అచ్చుగుద్దినట్లుగా.. అంబటి డ్యాన్స్, డ్రస్‌లాగే ఉన్నాయి. ఆ డ్యాన్స్‌కు పవన్ వంకలు పెడుతూ.. ఆ డ్యాన్స్ ఏంటి..? ఆ నడకేంటి..? డైలాగ్స్ పేల్చుతారు. ఇదే వైసీపీ శ్రేణులకు కోపం తెప్పించిందట. రియల్ లైఫ్‌కు.. రీల్‌ లైఫ్‌కు ముడిపెడుతూ మా మంత్రిగారినే ఇమిటేట్ చేస్తారా..? అని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసేస్తున్నారు. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ.. ఇలా రీల్ లైఫ్‌లో తప్పితే.. రియల్ లైఫ్‌లో చేయడానికేముంది..? ఇలాగైనా సరే సంతోషపడండి..? ఇలా ట్విట్టర్ వేదికగా కొందరు వైసీపీ కార్యకర్తలు పనిగట్టుకుని మరీ వేలాది ట్వీట్లు చేయడం గమనార్హం. ఆఖరికి ఈ వ్యవహారంపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించే పరిస్థితికి వచ్చింది. దీంతో సినిమా ‘బ్రో’ కాస్త.. పొలిటికల్ ‘బ్రో’గా (Politcal Bro) మారిపోయింది. ఇంకేముంది.. అటు మంత్రి స్పందించడం, ఇటు ‘బ్రో’ సినిమా నిర్మాత, నటుడు పృథ్వీరాజ్ స్పందించడంతో అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో ఇదో పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మాకేందుకు మంత్రిగారు..?

ఈ డ్యాన్స్ వ్యవహారంపై పృథ్వీ స్పందించాడు. మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. అయినా అంబటి ఆస్కార్ నటుడేం కాదు కదా..?. నాకు ఇచ్చిన పాత్రనే నేను చేశాను. బ్రో చిత్రంలో బాధ్యత లేని వ్యక్తి పాత్రే నాది. సినిమాలో ఒక చిన్న పాత్ర ఉంది.. అని రెండు రోజులు పని చేయాలని దర్శకుడు సముద్రఖని నాకు చెప్పడంతో ఆ పాత్ర చేశాను. నా పాత్ర డ్యాన్స్.. మంత్రిలా ఉందని ఆయన అనుకుంటున్నారేమో..? మేం మాత్రం అలా అనుకోవట్లేదు. అంబటి రాంబాబును అనుకరించాల్సిన అవసరం మాకు ఇసుమంతైనా లేదు. జనసేన శ్రేణులు కూడా ఈ వాదనను ఖండిస్తున్నది. మంత్రులను కించపరుస్తున్నారని మాట్లాడుతున్నారు సరే.. పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఎలాంటి భాష వాడారు..? అయినా మంత్రి మాకంటే గొప్పగా డ్యాన్స్ చేశారు.. మా డ్యాన్స్ వేరు.. రాంబాబు డ్యాన్స్ వేరుఅని అంబటిపై పృథ్వీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

నేను రె‘ఢీ’..!

ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం పవన్ కల్యాణ్ ది కాదు. పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పది. సినిమాలోని డ్యాన్స్‌ను వైసీపీ వాళ్లు మరోలా అర్థం చేసుకుంటే చేసేదేమీ లేదు. పవన్ ను వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడాన్ని ఏమనాలి..?. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు నేను సిద్ధం. అంబటిని కచ్చితంగా చిత్తుగా ఓడిస్తాను. అంబటి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయిఅని పృథ్వీ చెప్పుకొచ్చారు. అయితే.. పృథ్వీ వేషధారణ, డ్యాన్స్ స్టెప్పులు, శ్యాంబాబు పేరు.. ఇవన్నీ కూడా ఏపీ మంత్రిని ఉద్దేశించి చేసినవే అని సినిమాలోని పృథ్వీ డ్యాన్స్‌ను.. ఇటు అంబటి డ్యాన్స్‌ను మిక్స్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి స్పందిస్తూ.. ‘గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

మొత్తానికి చూస్తే.. ‘బ్రో’లో శ్యాంబాబు డ్యాన్స్ చుట్టూనే ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద చర్చే జరుగుతోంది. అయితే.. సినిమాల్లో వ్యక్తులను, వ్యవస్థలను, ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం మామూలే. ఈ మధ్య ఆ డైలాగ్స్ మరీత ఎక్కువయ్యాయి. స్టార్ హీరోలు, సీనియర్, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా సినిమాల్లోకి రాజకీయాలపై పరోక్షంగా సెటైరికల్ డైలాగ్స్ పేలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘బ్రో’ సినిమాతో మరోసారి రచ్చకెక్కింది. అటు మంత్రి.. ఇటు మూవీ టీమ్ ఒకరిపై ఒకరు విమర్శలు, కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉండటంతో ఈ వివాదం మరింత పెద్దది అవుతోందో తప్ప.. ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు.


ఇవి కూడా చదవండి


Telangana Rains : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు


Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?


YSRCP Vs TDP : వైఎస్ జగన్‌కు ఝలక్.. మాజీ మంత్రి నారాయణ ఇంటిబాట పడుతున్న వైసీపీ నేతలు


Updated Date - 2023-07-29T16:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising