TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?
ABN, First Publish Date - 2023-08-18T19:30:48+05:30
అవును.. రాజకీయాల్లో (Politics) పదవులు రాగానే గర్వం పెరుగుతుంది..! ఈ మాటలు ఊరికే అనడం లేదు.. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం అలాగే ఉంది.. అందుకే ఇది కాదనలేని వాస్తవం.! ఒక్కసారి ఎమ్మెల్యేగా (MLA) గెలిస్తే చాలు తరాలకు తరగని ఆస్తిని కూడగట్టుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే చాలు కోట్లు గడిస్తున్నారు..
అవును.. రాజకీయాల్లో (Politics) పదవులు రాగానే గర్వం పెరుగుతుంది..! ఈ మాటలు ఊరికే అనడం లేదు.. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం అలాగే ఉంది.. అందుకే ఇది కాదనలేని వాస్తవం.! ఒక్కసారి ఎమ్మెల్యేగా (MLA) గెలిస్తే చాలు తరాలకు తరగని ఆస్తిని కూడగట్టుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే చాలు కోట్లు గడిస్తున్నారు. ఆయన మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు. నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ.. విప్లవోద్యమ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నాలుకలా మెదలుతున్నారు. ఇంత సాదారణ జీవితాన్ని గడుపుతున్న ఆయన ఎవరో కాదు.. గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah). ఖమ్మం జిల్లా ఇల్లెందు (Yellandu) నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి.. 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. హంగు, ఆర్బాటాలకు తావులేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గుమ్మడి నర్సయ్య గడిపారు. ఇప్పటికీ ఒక సామాన్య జీవితం గడుపుతున్నారు. నాటి నుంచి నేటి వరకూ అయన పేరు మీద ఓ పొలం తప్ప మరేమీ లేదంటే అతిశయోక్తి కాదు. బహుశా ఇలాంటి వ్యక్తులను రీల్‌లో (సినిమాల్లో) తప్ప రియల్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు.. చూసి ఉండం కూడా..! చాలా రోజుల తర్వాత గుమ్మడి కుటుంబం వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏమిటా కథ..? ఎన్నికల ముందే ఎందుకిలా చర్చ జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం..
ఇదీ అసలు కథ..!
రాజకీయాలను చాలామంది నడిపిస్తారు.. కానీ జనాన్ని నడిపించేవాడు.. జనాల కోసం నడిచేవాడే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తే గుమ్మడి నర్సయ్య. ఓటమి చెవి చూసిన నేతలు పార్టీలు మారుతూ ఉంటారు.. కానీ నర్సయ్య మాత్రం అదే పార్టీ, అదే ఎర్రజెండా నీడలోనే ఉన్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఏనాడు కూడా అవినీతిని దరిచేరనివ్వని గొప్ప నాయకుడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గుమ్మడి కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియవచ్చింది. నర్సయ్య కుమార్తె డాక్టర్ గుమ్మడి అనురాధ ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారట. ఇల్లందు నియోజకవర్గలోని బయ్యారం, ఇల్లందు మండలంలో భారీగా అనురాధ ఫ్లెక్సీలు వెలిశాయి. కొన్ని రోజులుగా అనురాధ బీఆర్‌ఎస్ (BRS) పోటీచేస్తున్నారని కొందరు.. కాదు కాదు.. కాంగ్రెస్ (Congress) తరఫున పోటీచేస్తున్నారని ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇరు పార్టీల అధిష్టానాలు కూడా గుమ్మడి ఫ్యామిలీని (Gummadi Family) సంప్రదించారన్నది తాజాగా అందుతున్న వార్త. గతంలో ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ ఇప్పుడు ఫ్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం, స్థానికంగా ఉండే యూత్.. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ‘ఇల్లందు నియోజకవర్గ ప్రజలు కోరుకునేది మిమ్మల్నే అక్క’ అని కొన్ని ఫ్లెక్సీల్లో ఉండటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) హాట్ టాపిక్ అయ్యింది.
అనురాధ గురించి..!
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఆమె పనిచేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా (Prinicipal) పనిచేస్తున్న అనురాధ.. ఓయూ చరిత్రలోనే ఆదివాసీ మహిళా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టడం తొలిసారి. అంతేకాదు.. ఇదే యూనివర్సిటీలోనే పీజీ, లా కోర్సులు చదివిన ఆమె ఓయూ లా విభాగంలో అసిస్టెంట్ప్రొఫెసర్గా జాయిన్అయ్యారు. ఎన్నో అవరోధాలను అధిగమించి.. అంతకుమించి ఎన్నో అవమానాలను గుండెల్లో దాచుకుని.. తన మూలలను మరవని కారణంగానే ఈరోజు ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆమె మిత్రులు, కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఏ గిరిజన జాతి నుంచి వచ్చిందో అదే గిరిజనల ఆస్తి హక్కుల పరిరక్షణపై 2017లో పీహెచ్‌డీ (PHD) చేశారు. తండ్రి నేర్పిన విలువలే లక్ష్యంగా జీవితం ప్రారంభిన గుమ్మడి అనురాధ ఎంతోమందికి ఆదర్శం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదివాసీ మహిళలు తలచుకుంటే ఎందులోనూ... ఎవ్వరికీ... తీసిపోరని గుమ్మడి అనూరాధ నిరూపించారు.! కాలేజీ రోజుల్లోనే ఈమె విద్యార్థి సంఘాల్లో కూడా పనిచేశారు. నాన్న లాగే అనురాధ కూడా హంగు, ఆర్బాటాలకు తావులేకుండా గడుపుతున్నారు. అందుకే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నది ఇల్లందు ప్రజల, యూత్ ఆకాంక్ష.. ఆ విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో బయటికి చెబుతున్నారు.
కేసీఆర్ ప్లాన్ ఇదట..!
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ (Khammam BRS) చాలా వీక్‌గా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ జిల్లా నుంచి పెద్ద తలకాయాలు ఓడటంతో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు గులాబీ బాస్. భారీగా వలసలు వచ్చినప్పటికీ పార్టీ బలపడిన దాఖలాల్లేవ్. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) లాంటి బడా నాయకులు కూడా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లాలో ‘కారు’కు టైర్లు ఊడినంత పనైంది. ఇటీవలే తెల్లం వెంకట్రావ్‌ను బీఆర్ఎస్ చేర్చుకున్న హైకమాండ్ ఇలా బలపడి పాగా వేయాలని మాస్టర్ ప్లాన్ చేశారట. ఇక ఇల్లందు విషయానికొస్తే.. కాంగ్రెస్ తరఫున గెలిచన హరిప్రియ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితుల్లేవట. అందుకే హరిప్రియ స్థానంలో కొత్త వ్యక్తిని.. మహిళను బరిలోకి దింపాలన్నది బాస్ ప్లానట. ఈ క్రమంలో జిల్లా నాయకులు కొందరు గుమ్మడి అనురాధ పేరు సూచించారట. వయసు రీత్యా.. నర్సయ్య టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అనురాధను కుదిరితే బీఆర్ఎస్ తరఫున లేని పక్షంలో పొత్తులో భాగంగా సీపీఎంఎల్ తరఫున బరిలోకి దింపాలని కేసీఆర్ వ్యూహమట. ఇలా చర్చలు నడుస్తుండగానే.. అనురాధ పేరిట భారీగా ఫ్లెక్సీలు (Anuradha Flexies) దర్శనమివ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వార్తలొస్తున్నాయ్.. ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయ్ సరే అనురాధ మనసులో ఏముంది..? అధిష్టానం సంప్రదిస్తే ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మరి.
ఇవి కూడా చదవండి
TS Congress : గద్దర్ చివరికోరిక నెరవేరస్తున్న రేవంత్ రెడ్డి.. సూర్య కోసం పరిశీలనలో రెండు నియోజకవర్గాలు..!?
RajyaSabha : రాజ్యసభకు ఈసారి ‘కేకే’ డౌటే.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..!?
TS Assembly Elections 2023 : కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. 10 ఉమ్మడి జిల్లాలకు ఫిక్స్..!?
TS Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఒకేసారి బీజేపీలోకి 22 మంది ముఖ్య నేతలు..!?
Updated Date - 2023-08-18T19:35:31+05:30 IST