ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi Disqualified: ఇందిర.. రాహుల్.. ఇద్దరికీ కర్ణాటక లింక్

ABN, First Publish Date - 2023-03-24T17:06:11+05:30

నానమ్మ ఇందిరాగాంధీ.. మనవడు రాహుల్ గాంధీ.. ఒకరంటే ఒకరికి అనంతమైన ఆప్యాయత.. నాన్మమ్మ గురించి చెప్పేటప్పుడు.. ఆమె చేయి పట్టుకుని.. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ లాన్‌లో తిరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నానమ్మ ఇందిరాగాంధీ (Indira Gandhi).. మనవడు రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఒకరంటే ఒకరికి అనంతమైన ఆప్యాయత.. నాన్మమ్మ గురించి చెప్పేటప్పుడు.. ఆమె చేయి పట్టుకుని.. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ లాన్‌లో తిరిగిన మధురానుభూతులు కదలాడుతుంటాయేమో.. వాటిని తలచుకుని రాహుల్ కళ్లలో తెలియని అనురాగం కనిపిస్తుంటుంది. మనవడంటే ఇందిరకూ అంతే ముద్దు. చిత్రంగా... నాడు నాన్నమ్మకు ఎదురైన పరిస్థితే ఇప్పడు రాహుల్‌కు ఎదురైంది. అదే లోక్‌సభ సభ్యత్వం అనర్హత.

నాడు.. నేడు.. ఎన్నికలే నేపథ్యం...

1971లో పాకిస్థాన్‌పై (Pakistan) జరిగిన యుద్ధంలో అఖండ విజయం సాధించి విజయేందిరగా వెలుగొందుతున్న ఇందిరాగాంధీ ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 352 సీట్లు గెలుచుకుని మరోసారి ప్రధాని అయ్యారు. తనకు అంతా తిరుగులేదని భావిస్తున్న తరుణంలో పిడుగులాంటి వార్త. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నుంచి ఆమె ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ కోర్టు (Allahabad high court) తీర్పునిచ్చింది. ఎన్నికల్లో ఇందిర అక్రమాలకు పాల్పడ్డారంటూ.. ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ (Raj Narayan) పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. నాడు ఆమెపై ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ తీర్పు వచ్చింది 1975 జూన్ 12న. అప్పటికి ఆమె ప్రధానిగా దాదాపు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్నారు. అయితే, ఎదురులేని విధంగా పాలిస్తున్న తనపై అనర్హత వేటు పడడంతో ఇందిరా ఆగ్రహోదగ్రులయ్యారు. సహచర నాయకులు రెచ్చగొట్టడంతో ఏకంగా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ (Emergency in India) విధించారు. 1975 జూన్ 25 నుంచి 21 నెలల పాటు.. 21 మార్చి 1977 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ మధ్య కాలంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, తన అనర్హత విషయంలో అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇందిరాగాంధీ పైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు.

మరోవైపు తాజాగా రాహుల్ గాంధీ కూడా ‘‘మోదీ ఇంటి పేరున్నవారంతా దొంగలు’’ అనే అర్థంలో ‘‘ఎన్నికల సందర్భంలో’’ చేసిన వ్యాఖ్యలు ఆయనపై అనర్హతకు దారితీశాయి. 2019 ఎన్నికల సందర్భంగా ఆయన కోలార్ జిల్లాలో ప్రచారంలో ఉండగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీపై ఆరేళ్ల పాటు అనర్హత వేటు పడగా.. రాహుల్ విషయంలో ఏం జరుగుద్దో చూడాలి.

అప్పుడూ.. ఇప్పుడూ కర్ణాటక...

1977లో ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ రాయ్ బరేలీ నుంచి రాజ్ నారాయణ చేతిలో ఓడిపోయారు. ఆమె పార్టీ కాంగ్రెస్ (Congress Party) కూడా దారుణ పరాజయం పాలైంది. అయితే, 1978లో కర్ణాటకలోని (Karnataka) చిక్‌మగళూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలకు అనర్హత వేటు ఎదుర్కొనడం గమనార్హం. రెండూ కర్ణాటక నేపథ్యంలోనే జరగడం యాక్సిడెంటల్ అనుకుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కర్ణాటక వారే. ఇక 1980లో ఇందిరా గాంధీ ప్రస్తుతం తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. మరో చిత్రమేమంటే.. రాహుల్ 2019 ఎన్నికల్లో సొంత రాష్ట్రంగా భావించే యూపీలోని అమేథీ (Amethi Lok sabha) నుంచి ఓడిపోయి కేరళలోని వాయనాడ్‌లో (Wayanad) గెలిచారు.

Updated Date - 2023-03-24T17:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising