JDS Kumaraswamy: పాపం కుమారస్వామి.. అన్న భార్యతో పెద్ద చిక్కే వచ్చి పడింది.. చివరికి ఏం జరుగుతుందో మరి..!
ABN, First Publish Date - 2023-04-01T11:43:21+05:30
హాసన్ శాసనసభ నియోజకవర్గం నుంచి తన సతీమణి భవానిని రంగంలోకి దించే విషయంలో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ గట్టిపట్టుతో ఉన్నట్టు జేడీఎస్ వర్గాల ద్వారా..
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): హాసన్ శాసనసభ నియోజకవర్గం (Hassan Assembly Constituency) నుంచి తన సతీమణి భవానిని ( రంగంలోకి దించే విషయంలో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ (Ex Minister HD Revanna) గట్టిపట్టుతో ఉన్నట్టు జేడీఎస్ వర్గాల ద్వారా తెలిసింది. తొలి జాబితాలో హాసన్ నియోజకవర్గం అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని భవాని భావిస్తుండగా ఇందుకు మాజీ సీఎం కుమారస్వామి (HD Kumaraswamy JDS) ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే జేడీఎస్‌పై కుటుంబ పార్టీగా ముద్ర పడిందని, భవాని రంగంలోకి దిగితే జాతీయ పార్టీలకు అదొక అస్త్రంగా మారుతుందని కుమారస్వామి ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం తన కోడలు భవాని అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నారు.
కుమారస్వామి మాత్రం మాజీ ఎమ్మెల్యే ఎస్ ప్రకాశ్ కుమారుడు హెచ్‌పీ స్వరూ్‌పవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సహజంగానే ఈ పరిణామం మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులైన కుమారస్వామి, రేవణ్ణ మధ్య అగాథాన్ని సృష్టించిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రీతంగౌడను ఓడించాలంటే భవానిని రంగంలోకి దించితే మంచిదని కొందరు జ్యోతిష్యులు కూడా దేవెగౌడకు సూచించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని జేడీఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Updated Date - 2023-04-01T11:43:27+05:30 IST